యూపీలో అమిత్‌షా ఇంటింటి ప్రచారం..300 స్థానాల్లో గెలుపుపై ధీమా

ABN , First Publish Date - 2022-01-22T23:01:13+05:30 IST

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా..

యూపీలో అమిత్‌షా ఇంటింటి ప్రచారం..300 స్థానాల్లో గెలుపుపై ధీమా

లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా శనివారంనాడు కైరనా నియోజకవర్గంలో బీజేపీ ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. పలుచోట్ల ఆయనకు సాదర స్వాగతం లభించింది. ''భారత్ మాతా కీ జై'' నినాదాలు చోటుచేసుకున్నాయి. ఈ సందర్భంగా అమిత్‌షా మీడియాతో మాట్లాడుతూ, ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 300 పైగా సీట్లను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.


''2014 జనవరి తర్వాత కైరనాకు రావడం ఇదే మొదటిసారి. ఇవాళ ఇక్కడి పరిస్థితి చూస్తుంటే చాలా ప్రశాంతంగా ఉంది. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి వేగం పెరిగింది. కైరనా ప్రజలు తరచు వలసలు వెళ్తుండేవారు. అయితే ఇప్పుడు ఆ ఆ పరిస్థితి లేదని వారే స్వయంగా చెబుతున్నారు. ఇవాళ 11 మంది సభ్యులున్న మిట్టల్ కుటుంబాన్ని కలుసుకున్నాను. అందరూ ఎలాంటి భయాలు లేకుండా ప్రశాంతంగా ఉన్నట్టు చెప్పారు. పశ్చిమ యూపీలోని ఓటర్లంతా ఉదయమే సాధ్యమైనంత త్వరగా ఓటింగ్ పూర్తి చేసుకోవాలని కోరుతున్నాను. ఈసారి రాష్ట్రంలో 300కు పైగా సీట్లను బీజేపీ గెలుచుకుంటుంది'' అని  అమిత్‌షా అన్నారు.

Updated Date - 2022-01-22T23:01:13+05:30 IST