Amit Shah: తెలంగాణ విమోచన వజ్రోత్సవ వేడుకలకు అమిత్ షా
ABN , First Publish Date - 2022-09-14T20:25:13+05:30 IST
సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన వజ్రోత్సవ వేడుకలకు కేంద్రహోం మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు.
హైదరాబాద్ (Hyderabad): సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన వజ్రోత్సవ వేడుకలకు కేంద్రహోం మంత్రి అమిత్ షా (Amit Shah) హాజరుకానున్నారు. ఈనెల 16, 17 తేదీల్లో అమిత్ షా హైదరాబాద్ పర్యటించనున్నారు. 16న అమిత్ షా హైదరాబాద్‌కు చేరుకుంటారు. 17న ఉదయం 8 గంటలకు పరేడ్ గ్రౌండ్స్‌లో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. ఇందుకోసం రాష్ట్ర బీజేపీ నేతలు భారీ ఎత్తున జనసమీకరణ చేస్తున్నారు. కాగా 16వతేదీ సాయంత్రం కృష్ణంరాజు కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఈ సందర్భంగా నటుడు ప్రభాష్‌తో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఇటీవల మునుగోడు పర్యటన సందర్భంగా హైదరాబాద్‌లో జూనియర్ ఎన్టీఆర్‌తో అమిత్ షా ప్రత్యేకంగా భేటీ అయిన విషయం తెలిసిందే.