పులితో పోరాటం... అభిషేక్ జననం... 45 ఏళ్ల క్రితం Amitabh Bachchan...

Published: Sat, 22 Jan 2022 17:09:35 ISTfb-iconwhatsapp-icontwitter-icon
పులితో పోరాటం... అభిషేక్ జననం... 45 ఏళ్ల క్రితం Amitabh Bachchan...

‘ఖూన్ పసీనా’... సరిగ్గా 45 ఏళ్ల క్రితం విడుదలైన అమితాబ్ బచ్చన్ స్టారర్. 1977లో జనం ముందుకు వచ్చిన ఆ సినిమా నాలుగున్నర దశాబ్దాలు పూర్తి చేసుకోవటంతో బిగ్ బి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అలనాటి ముచ్చట్లు చెప్పుకొచ్చారు. 

పులితో పోరాటం... అభిషేక్ జననం... 45 ఏళ్ల క్రితం Amitabh Bachchan...

‘ఖున్ పసీనా’ సినిమా షూటింగ్ సమయంలో తీసిన ఓ బ్లాక్ అండ్ వైట్ త్రోబ్యాక్ పిక్ అమితాబ్ బచ్చన్ నెటిజన్స్‌తో పంచుకున్నారు. అందులో ఆయన ఓ నిజమైన పులితో పోరాటం చేస్తూ ఉండటం మనం చూడవచ్చు! అదే విషయాన్ని తన పోస్టులో వివరించిన ఆయన మరో విశేషాన్ని కూడా ప్రస్తావించారు. ‘ఖున్ పసీనా’ సినిమా కోసం పులితో యుద్ధం చేస్తున్నప్పుడే అభిషేక్ పుట్టాడనే గుడ్ న్యూస్ కూడా అందాల్సి ఉండిందట. ఇన్‌ఫ్యాక్ట్, ఆయన ఓ వైపు యాక్షన్ చేస్తూనే మరోవైపు వారసుడు పుట్టాడనే శుభవార్త కోసం ఎదురూ చూస్తూ సమయం గడిపాడట. 45 ఏళ్ల కిందటి ఆ ఉద్విగ్న క్షణాల్ని తాజాగా అమితాబ్ జ్ఞాపకం చేసుకున్నారు. ఇన్‌స్టా పోస్ట్‌లో ఆయన పులితో పోరాటం చేసిన స్టూడియో పేరు కూడా తన ఫాలోయర్స్‌కి చెప్పారు. ముంబైలోని చండీవలీ స్టూడియోస్‌లో షూట్ జరిగినట్టు సమాచారం... 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest News in Teluguమరిన్ని...