అమితాబ్ కంటికి శస్త్రచికిత్స

ABN , First Publish Date - 2021-03-02T00:18:30+05:30 IST

శస్త్రచికిత్స చేయించుకుంటున్నానంటూ ఇటీవల 'బిగ్ బీ' అమితాబ్ బచ్చన్ చేసిన ట్వీట్..

అమితాబ్ కంటికి శస్త్రచికిత్స

ముంబై: శస్త్రచికిత్స చేయించుకుంటున్నానంటూ ఇటీవల 'బిగ్ బీ' అమితాబ్ బచ్చన్ చేసిన ట్వీట్‌‌ అభిమానుల్లో ఆందోళన నింపడంతో సోమవారంనాడు తన శస్త్రచికిత్స వివారాలను బిగ్ బీ వెల్లడించారు. కంటి ఆపరేషన్ చేయించుకున్నానంటూ ఆయన తన బ్లాగ్‌లో వివరించారు. తన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందుతూ, త్వరగా కోలుకోవాలని ప్రార్ధించిన అభిమానులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.


'నేను త్వరగా కోలుకోవాలని ఆశించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఈ వయసులో కంటి శస్త్రచికిత్స అనేది చాలా సున్నితమైంది. చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. మంచి చికిత్స అందించారు. క్రమంగా దృష్టి మెరుగవుతోంది. అందువల్ల నేను టైపింగ్ తప్పిదాలు చేస్తే మరోలా భావించవద్దు' అని బచ్చన్ తన బ్లాగ్‌లో రాశారు. మరో కంటికి కూడా ఆపరేషన్ చేయించుకోవాల్సింది ఉందని కూడా ఆయన తెలిపారు. వికాస్ బెహల్ కొత్త చిత్రం (గుడ్‌బై) సమయానికి కోలుకుంటాననే ఆశాభావంతో ఉన్నట్టు చెప్పారు.

Updated Date - 2021-03-02T00:18:30+05:30 IST