మునుగోడుకు ప్రత్యేక నిధులపై అమితషా హామీ

ABN , First Publish Date - 2022-10-02T05:52:41+05:30 IST

మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం కేంద్ర హోమంత్రి అమితషా ప్రత్యేక నిధులు మంజూరు చేయడానికి అంగీకరించారని తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలిపారు.

మునుగోడుకు ప్రత్యేక నిధులపై అమితషా హామీ
సంస్థాననారాయణపురంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

 తాజా మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి

చౌటుప్పల్‌ రూరల్‌, అక్టోబరు 3: మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం కేంద్ర హోమంత్రి అమితషా ప్రత్యేక నిధులు మంజూరు చేయడానికి అంగీకరించారని తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. శనివారం చౌటుప్పల్‌ మండలం తంగడపల్లిలో రాజగోపాల్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే అమితషాను కలిసినట్టు తెలిపారు. మునుగోడు నియోజకవర్గంలో రోడ్ల కోసం రూ.200 కోట్లు మంజూరు చేయాలని కోరినట్టు తెలిపారు. నియోజకవర్గంలో ఈఎ్‌సఐ అసుపత్రి, యువతకు స్టేడియం, స్కిల్‌ డెవల్‌పమెంటు కోసం శిక్షణ కేంద్రం, పేదలు అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో జాతీయ బ్యాంకుల ద్వారా ముద్రలోన్లు మంజూరు చేయాలని కోరినట్టు తెలిపారు. 4, 5 రోజుల్లో మంజూరు కోసం చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్టు తెలిపారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుందని, దుర్మార్గమైన ప్రభుత్వం ప్రతిపాదనలు పంపకపోతే నిరాహారదీక్ష చేస్తానని హెచ్చరించారు. మునుగోడుకు అభివృద్ధికి ప్రత్యేక నిధులకు హామి ఇచ్చిన అమితషాకు కృతజ్జతలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ అండతో మునుగోడును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని తెలిపారు. సమావేశంలో నాయకులు ఉబ్బు వెంకటయ్య, పబ్బురాజుగౌడ్‌, ఊడుగు వెంకటేశం, అలె చిరంజీవి, అరిగే రమేష్‌ పాల్గొన్నారు. బీజేపీలో చేరిన వారిలో నాయకులు బొబ్బిళ్ళ మురళి, రాంనగర్‌ కాలనీవాసులు, లింగారెడ్డిగూడెం, ఎనగంటితండాకు చెందిన నాయకులు ఉన్నారు.

  తెలంగాణ వచ్చింది కేసీఆర్‌ కుటుంబం కోసమా?

సంస్థాన నారాయణపురం: తెలంగాణ వచ్చింది కేసీఆర్‌ కుటుంబం కోసమా? మనం బానిసలమా? అని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ప్రశ్నించారు. కుటుంబ పాలన అంతం కావాలంటే బీజేపీను గెలిపిచాలని కోరారు. మండల కేంద్రంలోని ఓ ఫంక్షనహాల్‌ పలు గ్రామాలకు చెందిన వారు అయన సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణాను కేసీఆర్‌ కుటుంబం దోచుకుని, సమస్యలపై అసెంబ్లీలో ఎన్నో సార్లు గళం విప్పినా పట్టించుకోని కేసీఆర్‌ ఇప్పుడు గ్రామాల్లో మంత్రులను, ఎమ్మెల్యేలను వార్డు మెంబర్లలా గల్లీలలో తిప్పుతున్నాడని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు దోనూరు వీరారెడ్డి, మండల అధ్యక్షుడు జక్కలి విక్రం, నాయకుడు దనరాజ్‌గౌడ్‌, బచ్చనగోని దేవేందర్‌, ఉప్పల లింగస్వామి, వెంకటాచారి, సురేందర్‌ రెడ్డి, ముద్దంగుల నర్సింహ, బిక్షపతినాయక్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2022-10-02T05:52:41+05:30 IST