తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: అమిత్ షా

ABN , First Publish Date - 2022-07-03T23:53:54+05:30 IST

తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: అమిత్ షా

తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: అమిత్ షా

హైదరాబాద్: తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా అన్నారు. పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పడిందన్నారు. తెలంగాణ ప్రజలకు నీళ్లు, నిధులు, నియామకాలు అందాయా? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ అవినీతి పాలనను అంతమొందిస్తామన్నారు. కేసీఆర్‌కు ఉన్న చింత ఒక్కటేనని, కేటీఆర్‌ను సీఎం చేయడమేనన్నారు. తెలంగాణ పోరాటానికి మొదటి నుంచి బీజేపీ మద్దుతుందన్నారు. రాష్ట్ర విభజనను కాంగ్రెస్ అసంపూర్తిగా చేసిందని మండిపడ్డారు. 


తెలంగాణ పోరాటానికి మొదటి నుంచి బీజేపీ మద్దుతుందన్నారు. రాష్ట్ర విభజనను కాంగ్రెస్ అసంపూర్తిగా చేసిందన్నారు. గతంలో మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు సమస్య రాలేదని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ మూఢనమ్మకాలతో సచివాలయాన్ని కూల్చారని మండిపడ్డారు. సచివాలయానికి కేసీఆర్ రాక ఎన్ని రోజులైంది? అని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో సచివాలయానికి వెళ్లేది బీజేపీ ముఖ్యమంత్రేనన్నారు. టీఆర్ఎస్ సర్కార్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని చెప్పారు. ఎంఐఎం కోసమే కేసీఆర్ విమోచన దినోత్సవం జరపడంలేదని వ్యాఖ్యానించారు. కేసీఆర్ విధానాలతో అభివృద్ధిలో తెలంగాణ వెనుకబడుతోందన్నారు. 



Updated Date - 2022-07-03T23:53:54+05:30 IST