ఆమ్లా జాట్జికి

ABN , First Publish Date - 2021-11-27T19:07:50+05:30 IST

ఉసిరికాయలు - ఆరు, పెరుగు - పావుకేజీ, వెల్లుల్లి రెబ్బలు - నాలుగు, మిరియాలు - 3గ్రా, ఉప్పు - రుచికి తగినంత, ఇంగువ - చిటికెడు, పుదీనా - ఒకకట్ట, ఎండుమిర్చి - రెండు, గుమ్మడి విత్తనాలు - 10గ్రా, ఆలివ్‌ ఆయిల్‌ - తగినంత.

ఆమ్లా జాట్జికి

కావలసినవి: ఉసిరికాయలు - ఆరు, పెరుగు - పావుకేజీ, వెల్లుల్లి రెబ్బలు - నాలుగు, మిరియాలు - 3గ్రా, ఉప్పు - రుచికి తగినంత, ఇంగువ - చిటికెడు, పుదీనా - ఒకకట్ట, ఎండుమిర్చి - రెండు, గుమ్మడి విత్తనాలు - 10గ్రా, ఆలివ్‌ ఆయిల్‌ - తగినంత.  


తయారీ విధానం: వెల్లుల్లి రెబ్బలు దంచుకోవాలి. మిరియాలు పొడి చేసుకోవాలి. పుదీనాను శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకోవాలి. ఎండుమిర్చిని ముక్కలుగా చేసుకోవాలి. గుమ్మడి విత్తనాలను డ్రై రోస్ట్‌ చేసుకోవాలి. ఒక బౌల్‌లో పెరుగు తీసుకోవాలి. తరువాత అందులో ఉసిరికాయల తురుము వేసి, ఉప్పు, దంచిన వెల్లుల్లి, ఇంగువ, పుదీనా, మిరియాల పొడి వేసి కలుపుకోవాలి. తరువాత ఎండుమిర్చి దంచి వేయాలి. గుమ్మడి విత్తనాలు వేసి కలుపుకోవాలి. ఆలివ్‌ ఆయిల్‌తో గార్నిష్‌ చేసి కబాబ్స్‌తో సర్వ్‌ చేసుకోవాలి.


Updated Date - 2021-11-27T19:07:50+05:30 IST