కర్నూలు జిల్లా: అమ్మ ఒడి డబ్బులను మోసగాళ్లు కాజేశారు. అది ఎలా అంటే.. అమ్మ ఒడి డబ్బులు ఖాతాల్లో జమ అయ్యాయా, వాలంటీర్ల పనితీరు ఎలా ఉందని గూడూరు ప్రజలకు దుండగులు ఫోన్ చేశారు. అమరావతి నుంచి అధికారులం మాట్లాడుతున్నామని ఓటిపి చెప్పండని మాట్లాడుతూ ఖాతాల్లో సొమ్ము కాజేశారు. తర్వాత తమ ఖాతాల్లో డబ్బులు లేవన్న విషయం తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటూ.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.