అమ్మఒడికి.. అవే సాకులు.. గత ఏడాదిలాగానే..

ABN , First Publish Date - 2020-12-24T05:37:50+05:30 IST

ఈ ఏడాది అమ్మఒడి అర్హుల తొలి జాబితాని జిల్లా..

అమ్మఒడికి.. అవే సాకులు.. గత ఏడాదిలాగానే..

గత ఏడాదిలాగానే పలువురి అనర్హత

తాజా జాబితాలో 86,036 మంది పేర్లు

విత్‌హెల్డ్‌లో  9,775 మంది విద్యార్థులు

ఆధారాలుంటే దాఖలకు 29వ తేదీ వరకు అవకాశం

25, 26, 27 వరుస సెలవులతో బాధితుల్లో ఆందోళన


గుంటూరు(ఆంధ్రజ్యోతి): జగనన్న అమ్మఒడి పథకానికి గత   ఏడాది ఏవైతే సాకులు పెట్టారో అవే   మళ్లీ అమలు చేశారు. ఈ దఫా అర్హులు, అనర్హులు, విత్‌ హెల్డ్‌ అంటూ మూడు కేటిగిరీలుగా వర్గీకరించారు. అనర్హులు, విత్‌హెల్డ్‌లో ఇంచు మించు 95 వేల మంది విద్యార్థులు ఉన్నారు. ఒక్క గుం టూరు నగరంలోనే ఈ సంఖ్య 29 వేల పైచిలుకు ఉన్నది. గత ఏడాది అమ్మఒడి అందుకున్న విద్యార్థుల్లో కొంతమంది పేర్లు ఈ ఏడాది అనర్హుల జాబితాలోకి వెళ్లడంతో వారు అయోమయానికి గురౌతున్నారు. కరెంటు బిల్లు, ఇల్లు,    ఐటీ తదితరాలను చూపుతూ అనర్హులు ప్రకటిం చడంపై పలువురు తల్లులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆధారాలు సమర్పించుకునేం దుకు అవకాశం ఇచ్చినా వరుస సెలవులతో వారు ఆందోళన చెందుతున్నారు.


ఈ ఏడాది అమ్మఒడి అర్హుల తొలి జాబితాని జిల్లా యంత్రాంగం విడుదల చేసిన విషయం తెలి సిందే. 6,55,671 మంది అర్హులు, 86,036 మంది అనర్హులు, 9,775 మంది పిల్లలను విత్‌హెల్డ్‌లో పెట్టారు. అనర్హుల పేర్ల పక్కన కారణాలను పేర్కొన్నారు. కుటుంబ ఆదాయం ఎక్కువగా ఉందని, భూమి ఎక్కువ విస్తీర్ణంలో కలిగి ఉన్నా రని, విద్యుత్‌ సగటు వాడకం 300 యూనిట్ల కంటే హెచ్చు ఉందని, మీ కు టుంబంలో ప్రభు త్వ ఉద్యోగి/పెన్షనర్‌ ఉన్నా రని, నాలుగు చక్రాల వాహనం కలిగి ఉన్నారని, ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారని, మునిసి పాలిటీల పరిధిలో వెయ్యి చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో స్థలం ఉందని పొం దుపరిచి అనర్హులుగా పేర్కొన్నారు. అయితే అనర్హుల జాబితాలో ఉన్న చాలామంది తమకు విద్యుత్‌ వాడకం తక్కువగా ఉన్నప్పటికీ ఎక్కువ ఉందని చెబుతున్నారని పేర్కొంటు న్నారు. అలానే చిన్న ఇల్లు ఉన్నా వెయ్యి చదరపు అడు గుల కంటే ఎక్కువ విస్తీర్ణం కలిగి ఉన్నారని చూపిస్తున్నారని తెలిపారు. కొన్ని సంవత్సరాల క్రితం ఎక్కువ ఆదాయం ఉన్న వారు ఐటీ చెల్లించారు. ఆ తర్వాత వారు ఆదాయం కోల్పో యి ఐటీ చెల్లించడం లేదు. అయిన ప్పటికీ వారిని ఐటీ చెల్లింపుదారులుగా చూపించి అనర్హుల జాబితాలో పెట్టారు. దీంతో వారంతా బుధవారం తమ వద్ద ఉన్న ఆధారాలతో పాఠశాలలు, ఎంఈవో, గ్రామ/ వార్డు సచివాలయాలకు క్యూ కట్టారు. అలానే విద్యుత్‌ బిల్లులు, ఇన్‌కం ట్యాక్స్‌లో తప్పులు సరిదిద్దుకునేందుకు సంబంధిత కార్యాలయాలకు వెళుతున్నారు. కాగా ఈ నెల 25, 26,. 27 తేదీలలో ప్రభుత్వ కార్యాల యాలకు వరుస సెలవుదినాలు. దీంతో గురువారం, వచ్చే సోమ, మంగళవారాల్లో దరఖాస్తులకు అవకాశం ఉన్నది. దీని వల్ల అనర్హుల జాబితాలో ఉన్న వారు ఆందోళన చెందుతున్నారు.


29 లోపు ఆధారాలు నివేదించాలి

అమ్మఒడి పథకం అర్హులు, అనర్హులు, విత్‌హెల్డ్‌ జాబితాలను స్కూళ్లకు పంపించాం. పాఠశాలల ద్వారా ఇప్పటికే ఈ సమాచారం పిల్లల తల్లులకు పంపించారు. విద్యార్థుల తల్లులు కూడా పాఠశాలలకు వెళ్లి చూసుకోవాలి. అనర్హులలో ఎవరైనా తాము అర్హులమని భావిస్తే సంబంధిత ఆధారాలతో ఈ నెల 29వ తేదీ లోపు సంబంధిత గ్రామ/వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకుని పరిష్కరించుకోవాలి. విత్‌హెల్డ్‌లో ఉన్న వారిని స్కూల్‌ హెచ్‌ఎం స్థాయిలో పరిశీలించి పరిష్కరిస్తారు. 

- పీ ప్రశాంతి, జాయింట్‌ కలెక్టర్‌(సచివాలయాలు)


Updated Date - 2020-12-24T05:37:50+05:30 IST