కన్నుల పండువగా బాసరలో అమ్మవారి రథోత్సవం

ABN , First Publish Date - 2021-10-17T06:20:26+05:30 IST

ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరలో సరస్వతి అమ్మ వారి రథోత్సవం కన్నులపండువగా సాగింది.

కన్నుల పండువగా బాసరలో అమ్మవారి రథోత్సవం
బాసర గ్రామంలో సరస్వతి అమ్మవారి రథోత్సవం

బాసర, అక్టోబరు 16 : ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరలో సరస్వతి అమ్మ వారి రథోత్సవం కన్నులపండువగా సాగింది. విజయదశమి పర్వదినాన సర స్వతి అమ్మవారిని గ్రామవీధుల గుండా ఊరేగింపు జరపడం ఇక్కడ ఆన వాయితీగా వస్తోంది. అందులో భాగంగానే నవరాత్రి మహోత్సవాల చివరి రోజు విజయదశమి నాడు సరస్వతి అమ్మవారిని శుక్రవారం బాసర గ్రామం లో ఊరేగింపు ఘనంగా జరిగింది. ఆలయం నుండి ప్రారంభమైన అశ్వ రథయాత్రకు అడుగడుగునా మహిళలు మంగళహారతులతో స్వాగతం పలి కారు. గడపగడపకు గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మూడు గంటల పాటు సాగిన రథోత్సవంతో ఊరంతా ఆధ్యాత్మిక వాతావరణం కనిపించింది. తిరిగి ఆలయానికి చేరుకొని శమీపూజ నిర్వహించి సాంప్ర దాయ బద్దంగా దసరా వేడుకలను స్థానికులు జరుపుకున్నారు. నిత్యం భక్తులతో కనిపించే అమ్మవారి ఆలయం స్థానికులతో కళకళలాడింది. 

Updated Date - 2021-10-17T06:20:26+05:30 IST