దివ్యాంగుడి కుటుంబానికి ‘అమ్మఒడి’ ఎగవేత

ABN , First Publish Date - 2022-06-26T05:48:05+05:30 IST

అసలే దివ్యాంగుడు... అతనికి ఉన్నది రెండెకరాల పొలం. పొట్టకూటి కోసం ఆటో నడుపుకొం టున్నాడు. అయితే అతని కుటుంబానికి 14 ఎకరాల పొలం ఉందని రికార్డుల్లో చూపి అమ్మఒడికి పంగనామం పెట్టారు.

దివ్యాంగుడి కుటుంబానికి ‘అమ్మఒడి’ ఎగవేత
రికార్డులో అధిక భూమి ఉన్నట్లు చూపిస్తున్న బాధితుడు


రొద్దం, జూన 25 : అసలే దివ్యాంగుడు... అతనికి ఉన్నది రెండెకరాల పొలం. పొట్టకూటి కోసం ఆటో నడుపుకొం టున్నాడు. అయితే అతని కుటుంబానికి 14 ఎకరాల పొలం ఉందని రికార్డుల్లో చూపి   అమ్మఒడికి పంగనామం పెట్టారు. రొద్దం మండలం కోగిర గ్రామానికి చెందిన ముత్యాలమ్మ, రాజ్‌గో పాల్‌ దంపతుల కుమార్తె గాయిత్రి మండలపరిషత పాఠశాలలో 1వ తరగతి చదువుతోంది. రాజగోపాల్‌ రోడ్డు ప్రమా దంలో ఇటీవల కాలు విరిగింది. రెండెక రాల పొలంలో వ్యవసాయం చేయడానికి చేతకాక ఆటో నడుపుకుం టూ కుటుం బాన్ని పోషించుకుంటున్నారు. ప్రభుత్వం అమ్మఒడి జాబితాను సచివాలయాలకు పంపగా పాసుపుస్తకం ఖాతా నంబరు 269నందు 14ఎకరాల భూమి ఉన్నట్లు రెవెన్యూ రికార్డుల్లో చూపిస్తుండటంతో అమ్మఒడికి అనర్హుడయ్యాడని తెలిపారు. దీంతో లబ్దిదారుడు ఖంగుతిన్నాడు. తమకు అమ్మఒడి వద్దు .. 14 ఎకరాల భూమి ఎక్కడుందో చూపిస్తే అది అమ్ముకుని బతికేస్తామని సచివాలయ అధికారులను లబ్దిదారులు నిలదీశారు. అయితే ఆ కుటుంబానికి త్వరలో రేషనకార్డు కూడా దగ్గరలోనే తొలగిపోతుందని అధికారులు చావుకబురు చల్లగా చెప్పడంతో దివ్యాంగుడు ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. మండలంలో గత యేడాదికంటే ఈ యేడాది 70 మంది లబ్దిదారులను అనర్హుల జాబితాలో ఉంచినట్లు తె లిసింది.


Updated Date - 2022-06-26T05:48:05+05:30 IST