అమ్ముకోలేక..నిల్వ చేయలేక..!

ABN , First Publish Date - 2021-01-25T05:53:23+05:30 IST

మండలంలో మినుము పంట సాగు చేసిన రైతుల పరిస్థితి అగమ్య గోచ రంగా ఉంది.

అమ్ముకోలేక..నిల్వ చేయలేక..!
మొలకెత్తిన మినుము కాయలు (ఫైల్‌)



నివర్‌  తుఫాన్‌తో నాణ్యత 

కోల్పోయిన మినుము పంట

తక్కువ ధరకు అడుగుతున్న వ్యాపారులు

ఆందోళనలో రైతులు 

పీసీపల్లి, జనవరి 24 : మండలంలో మినుము పంట సాగు చేసిన రైతుల పరిస్థితి అగమ్య గోచ రంగా ఉంది. నివర్‌ తుఫాన్‌ తట్టుకొని ఎంతో కొంత మినుమును పండించిన వాటిని అమ్ము కోవడానికి  అవస్థలు పడుతున్నారు. వర్షం కారణంగా మిను ము చేలు దెబ్బతిన్నాయి. అప్పుడు వర్షం కారణంగా చేలలోనే పంట తడిసి ముద్దవడంతో కాయలు మొలకెత్తాయి. గింజలు నాణ్యత కోల్పోయాయి. మండలంలో సుమారు 3200 హెక్టార్లలో మినుము పంట సాగు చేశారు. ప్రధానంగా తురకపల్లి, గుం టుపల్లి, లక్ష్మక్కపల్లి, మెట్లవారిపాలెం, పెద ఇర్ల పాడు, వెంగళాయపల్లి పెదచెర్లోపల్లి, నేరేడుపల్లి, పెద్దన్నపల్లి, తలకొండపాడు గ్రామాల పరిధిలో రైతులు అత్యధికంగా మినుము పంట సాగు చేశా రు. అపరాలకు మార్కెట్‌లో మంచి గిరాకీ ఉం టుం దని, అధిక ధర పలుకుతుందని ఆశించిన పలు వురు రైతులు సొంత భూములే కాకుండా కొందరు రైతులు భూములను కౌలుకు తీసుకొని మరీ మిను ము సాగు చేశారు. ఒక్కో ఎకరాకు సుమారుగా 18 నుంచి రూ.20 వేల వరకు ఖర్చు చే శారు. ఎకరా కౌలుకు రూ.3 వేలు, విత్తనాలకు రూ.3 వేలు, దుక్కి కి రూ. 3 వేలు, బలం మందు రూ. 2 వేలు, రసాయనిక మందులు రూ.5 వేలు, మినుము కోతకు రూ. 3 వేలు, మిల్లుకు రూ.2 వేలు ఈ విధంగా ఎక రాకు రూ. 18 వేల నుంచి రూ.20 వేల వరకు పెట్టుబడి పెట్టడం జరి గింది. తీరా పంట కోతకొస్తున్న దశలో నివర్‌ తుఫాన్‌ వీరి ఆశలపై నీళ్లు చల్లింది. పంట దెబ్బతినడంతో మిను ములు నాణ్యత కోల్పోయింది. దీంతో వ్యాపారులు తక్కువ ధరలకు అడుగు తున్నారు. క్వింటా రూ. 2 వేల నుంచి రూ.3500 కంటే ఎక్కువ ధర పలక డం లేదని రైతులు ఆవేదన చెందు తున్నారు. ఈ ధరలకు విక్రయిస్తే పెట్టుబడి కూడా రాదని, తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. 

గతంలో ప్రభుత్వం రైతులు సాగు చేసిన పంటలను రైతు భరోసా కేంద్రాల్లోనే మార్కెట్‌ ధరకు కొనుగోలు  చేస్తామని ప్రకటనలు గుప్పిం చిందే తప్ప ఎక్కడా  మినుము కొనుగోలు కేంద్రా లను ఏర్పాటు చేయ లేదని రైతులు ఆరోపిస్తున్నా రు. ఓ వైపు ఎరువులు, పురుగు మందుల దుకాణా ల్లో అప్పులు చెల్లించమని వ్యాపారుల నుంచి ఒత్తిడి, మరో వైపు మరీ తక్కువ ధరలకు అమ్ముకోలేక ఇటు పంటను నిల్వ  చేయలేక రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల వద్ద నుంచి ప్రభుత్వ మద్దతు ధరతో మినుములు కొనుగోలు చేయాలని మండ లంలో మినుములు సాగు చేసిన రైతులు కోరు తున్నారు. 


Updated Date - 2021-01-25T05:53:23+05:30 IST