అటకెక్కిన అభివృద్ధి

ABN , First Publish Date - 2021-04-23T10:51:24+05:30 IST

రాష్ట్రం నడిబొడ్డులో ఉన్న అమరావతిని కాదని 3 రాజధానులనటం అభివృద్ధిని అటకెక్కించడానికేనని అమరావతి రైతులు మండిపడ్డారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని

అటకెక్కిన అభివృద్ధి

మోతడకలో నిరసనలు వ్యక్తం చేస్తున్న మహిళలు

492వ రోజు అమరావతి రైతుల ఆందోళనలు


తుళ్లూరు, ఏప్రిల్‌ 22: రాష్ట్రం నడిబొడ్డులో ఉన్న అమరావతిని కాదని 3 రాజధానులనటం అభివృద్ధిని అటకెక్కించడానికేనని అమరావతి రైతులు మండిపడ్డారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ రైతులు, మహిళలు చేస్తున్న ఉద్యమం గురువారంతో 492వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ధర్నా శిబిరాల వద్ధ వారు మాట్లాడుతూ కన్నతల్లి లాంటి భూములు ఇచ్చి అభివృద్ధి నిలిచిపోవటంతో మనోవేదనతో రైతులు మరణిస్తుంటే ప్రభుత్వంలో చలనం లేదన్నారు. అమరావతి కొనసాగాలంటూ రైతులు నినాదాలు చేశారు. అమరావవతి వెలుగు కార్యక్రమం కింద దీపాలు వెలగించి నినాదాలు చేశారు.

Updated Date - 2021-04-23T10:51:24+05:30 IST