Amravati: NIA కు కెమిస్ట్ హత్య కేసు

ABN , First Publish Date - 2022-07-02T22:25:49+05:30 IST

హారాష్ట్రలోని అమ్రావతిలో కెమిస్ట్ ఉమేష్ కొల్హే హత్య కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ చేపట్టనున్నట్టు..

Amravati: NIA కు కెమిస్ట్ హత్య కేసు

ముంబై: మహారాష్ట్రలోని అమ్రావతిలో కెమిస్ట్ ఉమేష్ కొల్హే హత్య కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) చేపట్టనున్నట్టు హోం మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒకరు శనివారంనాడు  తెలిపారు. జూన్ 21వ తేదీన జరిగిన కెమిస్ట్ వెనుక ఉన్న కుట్రపై ఎన్ఐఏ దర్యాప్తు జరుపుతుందని ఆయన ఒక ట్వీట్‌లో తెలిపారు. ఈ హత్య వెనుక ఏదైనా సంస్థల ప్రమేయం కానీ, అంతర్జాతీయ సంస్థల ప్రోత్సహం కానీ ఉందా అనే విషయాన్ని కూడా ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుందన్నారు.


కొల్హే జూన్ 21వ తేదీ రాత్రి దుకాణం మూసివేసిన అనంతరం ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తుండగా 10-10.30 గంటల మధ్యలో హత్యకు గురయ్యారు. ఆ సమయంలో ఆయన కుమారుడు సాకేత్ (27), భార్య వైష్ణవి మరో వాహనంపై వెళ్తున్నారు. సాకేత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఎన్జీవోను నడుపుతున్న ఇర్ఫాన్ ఖాన్ (32) అనే వ్యక్తిని ప్రధాన నిందితుడిగా గుర్తించారు. పరారీలో ఉన్న ఇర్ఫాన్ ఖాన్ కోసం గాలిస్తున్నారు. కాగా, అమ్రావతి సిటీలో మెడికల్ షాప్‌ను కొల్హే నడుపుతున్నాడని, నూపుర్ శర్మ కామెంట్లకు మద్దతుగా కొన్ని వాట్సాప్ గ్రూపులకు ఆయన ఒక పోస్ట్‌ను షేర్ చేశారని, పొరపాటున ముస్లింలు సభ్యులుగా ఉన్న గ్రూప్‌నకు కూడా ఆయన ఆ పోస్ట్ చేశారని సిటీ కొత్వాలి పోలీస్ స్టేషన్ అధికారి ఒకరు చెప్పారు.

Updated Date - 2022-07-02T22:25:49+05:30 IST