రూ.18 లక్షల లోన్ తీసుకుని మరీ కొడుకును America కు పంపించారు.. ఇప్పుడు ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటంటే..

ABN , First Publish Date - 2022-05-14T23:27:00+05:30 IST

‘నాన్న అమెరికా వెళ్లి పెద్ద చదువులు చదువుతా’ అని కొడుకు అనగానే ఆ తండ్రి సంతోషించాడు. కుమారుడు ప్రయోజకుడు కావాలని, జీవితంలో ఉన్నతంగా బతకాలని కోరుకున్న ఆ తండ్రి.. అగ్రదేశం వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అయితే ప్రస్తుతం ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉందనే విషయాన్ని పరిశీలిస్తే..

రూ.18 లక్షల లోన్ తీసుకుని మరీ కొడుకును America కు పంపించారు.. ఇప్పుడు ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటంటే..

ఇంటర్నెట్ డెస్క్: ‘నాన్న అమెరికా వెళ్లి పెద్ద చదువులు చదువుతా’ అని కొడుకు అనగానే ఆ తండ్రి సంతోషించాడు. కుమారుడు ప్రయోజకుడు కావాలని, జీవితంలో ఉన్నతంగా బతకాలని కోరుకున్న ఆ తండ్రి.. మారో ఆలోచన చేయలేదు. అగ్రదేశం వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అంతేకాదు.. ప్రయాణానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలని.. అందుకు కావాల్సిన డబ్బును సర్దబాటు చేస్తానని కొడుకుకు భరోసా ఇచ్చాడు. రూ.18లక్షలు లోన్ తీసుకుని మరీ కొడుకును America పంపించాడు. అయితే ప్రస్తుతం ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉందనే విషయాన్ని పరిశీలిస్తే..


ఆ యువకుడి పేరు జాగ్‌రూప్. పంజాబ్‌లో అమృత్‌సర్ ఏరియాలోని చిచెవాల్ అతడి స్వగ్రామం. చిన్నప్పటి నుంచి చదువులు చురుకుగా ఉండే ఇతడు.. అమెరికా వెళ్లి ఉన్నత చదవులు చదవాలని ఆశపడ్డాడు. విషయాన్ని తన తండ్రికి చెప్పాడు. దానికి అతడి తండ్రి కూడా అంగీకరించాడు. అంతేకాకుండా జాగ్‌రూప్ వీసాకు సంబంధించిన ఏర్పాట్లలో ఉంటే.. అతడి తండ్రి డబ్బులను సర్దే పనిలో పడ్డారు. ఎట్టకేలకు ఆ యువకుడు స్టూడెంట్ వీసా సంపాదించాడు. ఈ క్రమంలోనే అతడి తండ్రి కూడా లోన్ తీసుకుని రూ.18లక్షలు సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో సుమారు ఐదు నెలల క్రితం కుటుంబ సభ్యులంతా ఎయిర్‌పోర్టుకు వెళ్లి జాగ్‌రూప్‌ను అమెరికా పంపించారు. అయితే శనివారం ఉదయాన్నే జాగ్‌రూప్ కుటుంబ సభ్యలకు ఓ ఫోన్ వచ్చింది.



అవతలి వాళ్లు చెప్పింది విని కుటుంబ సభ్యులు షాకయ్యారు. ఎప్పటిలాగే తన గదికి వెళ్లి పడుకున్న జాగ్‌రూప్ ఉదయాన్నే నిద్ర లేవలేదనీ.. ఆసుపత్రికి తీసుకెళ్తే అతడు చనిపోయినట్టు డాక్టర్లు నిర్ధారించారిని స్నేహితుడు ఫోన్ చేసి చెప్పటంతో కుప్పకూలిపోయారు. ఈ సందర్భంగా జాగ్‌రూప్ తండ్రి మాట్లాడుతూ.. ఒక్కగానొక్క కొడుకు మృతిపై అనుమానం వ్యక్తం చేశారు. తమ కొడుకు మృతిగల కారణాలపై నిగ్గు తేల్చాలని అమెరికా ప్రభుత్వాన్ని కోరారు. ఇదే సమయంలో జాగ్‌రూప్ మృతదేహాన్ని అమెరికా నుంచి సాధ్యమైనంత త్వరగా ఇండియాకు రప్పించే చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వాన్ని వేడుకున్నారు. 


Read more