నాడు ఫ్లోరైడ్‌ విముక్తికి.. నేడు గూడు కోసం

ABN , First Publish Date - 2020-11-28T06:42:03+05:30 IST

ఫ్లోరైడ్‌ విముక్తి కి గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమించిన నల్లగొండ జిల్లాకు చెందిన ఫ్లోరోసిస్‌ బాధితుడు అంశుల స్వామి నేడు గూడు కోసం పోరాటం చేస్తున్నా డు.

నాడు ఫ్లోరైడ్‌ విముక్తికి.. నేడు గూడు కోసం
అనాథాశ్రమంలో ఉంటున్న అంశుల స్వామి కుటుంబం

మర్రిగూడ, నవంబరు 27 : ఫ్లోరైడ్‌ విముక్తి కి గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమించిన నల్లగొండ జిల్లాకు చెందిన ఫ్లోరోసిస్‌ బాధితుడు అంశుల స్వామి నేడు గూడు కోసం పోరాటం చేస్తున్నా డు. పుట్టుకతోనే ఫ్లోరైడ్‌తో బాధపడుతున్న స్వామికి డబుల్‌ బెడ్‌రూమ్‌ కేటాయించాలని రెండేళ్ల క్రితం మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన హామీ అమలుకాకపోవడంతో ఇంటి కోసం నల్లగొండ జిల్లా కలెక్టర్‌ చుట్టూ తిరుగుతున్నాడు. మంత్రి హామీ అమలుకాక, నిలువ నీడలేక అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిదండ్రులతో కలిసి సరంపేటలోని ఓ అనాథాశ్రమంలో తలదాచుకుంటున్నాడు. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండ లం శివన్నగూడ గ్రామానికి చెందిన అంశుల స్వామి పుట్టుకతోనే ఫ్లోరోసి్‌సతో బాధపడుతున్నాడు. తండ్రి సత్యనారాయణ క్షౌరశాలలో పనిచేస్తుండగా, తల్లి యాదమ్మ కూలి పని చేసేది. అక్కకు వివాహం కాగా, తల్లిదండ్రులతో ఉం టున్నాడు. ఆరో తరగతి వరకు చదివి న 32ఏళ్ల అంశుల స్వామి ఎక్కడికి వెళ్లాలన్నా వీల్‌చైర్‌లో ఒకరు తోడుగా ఉండి వెంట తీసుకెళ్లాల్సి ఉంది. ఫ్లోరోసి స్‌ నుంచి విముక్తి పొందాలంటే మంచినీరు కావాలని ఫ్లోరైడ్‌ విముక్తిపోరాట సమితి కన్వీనర్‌ కంచుకట్ల సుభా్‌షతో కలిసి అంశుల స్వామి గల్లీ నుంచి డిల్లీ వరకు ఉద్యమించాడు. పదేళ్ల క్రితం తండ్రికి బ్రెయిన్‌ స్ర్టోక్‌తో పక్షవాతం వచ్చింది. నాలుగేళ్లుగా తీవ్రంగా ఉండటం తో మంచానికే పరిమితమయ్యాడు. తల్లి ఫ్లోరోసి్‌సతో బాధపడుతుండగా; నడవలేక ఇబ్బంది పడుతోంది.
ఈ నేపథ్యంలో ఎన్‌ఆర్‌ఐ ఫౌండేషన్‌ తరుఫున సామాజిక కార్యకర్త జలగం సుధీర్‌ ట్విట్టర్‌లో కేటీఆర్‌ దృష్టికి తీసుకువెళ్లటంతో క్షౌరశాల ఏర్పాటు చే యాలని, డబుల్‌ బెడ్‌రూమ్‌ కేటాయించాలని 2018 మే నెలలో అప్పటి నల్లగొండ జిల్లా కలెక్టర్‌ గౌరవ్‌ఉప్పల్‌ను కేటీఆర్‌ ఆదేశించారు. దీంతో రూ.1,50,000 వ్య యంతో కలెక్టర్‌ గౌరవ్‌ఉప్పల్‌ క్షౌరశాలను ఏర్పాటు చేయించగా, స్వామి బావ ఆ దుకాణాన్ని నిర్వహిస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. సొంత ఇల్లు కూలిపోయి కురుస్తూ గోడలు మాత్రమే మిగలటంతో నిలువ నీడలేక ఎనిమిది నెలలుగా సరంపేటలోని ఓ అనాథాశ్రమంలో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నా డు. తండ్రి నాలుగేళ్లుగా ఏ పని చేయకపోవడం, తల్లి ఫ్లోరైడ్‌తో బాధపడుతుండటంతో డబుల్‌ బెడ్‌ రూమ్‌ కేటాయించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్‌ను కలిసి విన్నవించాడు.
పుట్టెడు కష్టాల్లో స్వామి కుటుంబం
తండ్రి సత్యనారాయణకు పక్షవాతం రావడంతో ఉపాధి పోయిందని, తల్లి సైతం పక్షవాతానికి గురై మంచానికే పరిమితం కావడం తో కుటుంబ పోషణ భారంగా మారిందని అంశులస్వామి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తనకు డబుల్‌ బెడ్‌రూం ఇల్లు కేటాయించాలని మంత్రి కేటీఆర్‌ పలుమార్లు ఆదేశించినా జిల్లా అధికారులు స్పందించలేదని స్వామి వాపోతున్నాడు. ఈ ఏడాది ఐదుసార్లు నల్లగొండ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌పాటిల్‌ను కలిసి డబుల్‌ బెడ్‌రూమ్‌ కేటాయించాలని కోరానన్నాడు. దీపావళి అనంతరం డబుల్‌ బెడ్‌          రూం ఇల్లు నిర్మించి ఇస్తామని నాడు కలెక్టర్‌ హామీ ఇచ్చినా, అమ లు కాలేదన్నారు. తన కుటుంబ ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉం డడంతో అనాథ ఆశ్రమంలో తలదాచుకుంటున్నట్లు తెలిపాడు. అధికారులు స్పందించి ఫ్లోరోసిస్‌ బారినపడిన తనను, తన కుటుంబా న్ని ఆర్థికంగా ఆదుకోవడమే గాక మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన హామీ అమలు చేయాలని కోరుతున్నాడు. మర్రిగూడ మండలంలో ఇప్పటివరకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం మొదలు కానుందున తన కు ఇల్లు కట్టించి ఇవ్వాలని అంశుల స్వామి వేడుకుంటున్నాడు.
ప్రభుత్వానికి నివేదించాం
జిల్లాలోని ఫ్లోరోసిస్‌ బాధితులకు ఇల్లు కట్టించి ఇచ్చే విషయమై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాము. మర్రిగూడ మండలం శివన్నగూడెంలో డబుల్‌ బెడ్‌ రూమ్‌ నిర్మాణానికి స్థలాలు లేనందున స్వామి సొంత స్థలంలో ఇల్లు కట్టించి ఇచ్చేలా ప్రభుత్వానికి లేఖ రాశాము. ప్రభుత్వ నిర్ణయం మేరకు ఇంటి నిర్మాణం ఉంటుంది.
- ప్రశాంత్‌జీవన్‌పాటిల్‌, నల్లగొండ జిల్లా కలెక్టర్‌

Updated Date - 2020-11-28T06:42:03+05:30 IST