అమూల్‌ను దెబ్బతీసేలా వ్యవహరిస్తే చర్యలు

ABN , First Publish Date - 2021-02-26T05:52:23+05:30 IST

జిల్లాలో అమూల్‌ ప్రాజెక్టును దెబ్బతీసేలా ఉద్దేశపూర్వకంగా ప్రవర్తించే వారిపై కఠినచర్యలు తప్పవని కలెక్టర్‌ పోలా భాస్కర్‌ హెచ్చరించారు.

అమూల్‌ను దెబ్బతీసేలా వ్యవహరిస్తే చర్యలు
మాట్లాడుతున్న కలెక్టర్‌ పోలా భాస్కర్‌




కలెక్టర్‌ పోలా భాస్కర్‌ 


ఒంగోలు(కలెక్టరేట్‌), ఫిబ్రవరి 25 : జిల్లాలో అమూల్‌ ప్రాజెక్టును దెబ్బతీసేలా ఉద్దేశపూర్వకంగా ప్రవర్తించే వారిపై కఠినచర్యలు తప్పవని కలెక్టర్‌ పోలా భాస్కర్‌ హెచ్చరించారు. అమూల్‌తో పాటు ప్రైవేటు డెయిరీలకు పా లు పోసే రైతులు లాభాపేక్షతో కల్తీకి పాల్పడితే వారిపై కూడా చర్యలు తప్పవన్నారు. స్థానిక కలెక్టర్‌ సమావేశపు హాలులో గురువారం అమూల్‌ పురోగతిపై పలుశాఖల అధికారులతో జరిగిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. అమూల్‌కు పాలుపోసే రైతులకు ఆ స ంస్థపై అపనమ్మకం కలిగేలా పాలసొసైటీల సెక్రటరీలు కొన్నిచోట్ల ఉద్దేశపూర్వకంగానే అవకతవకలకు పాల్పడుతున్నట్లు అనుమానాలున్నాయని తెలిపా రు. 142 సొసైటీల్లో 12 చోట్ల మాత్రమే సమస్యలు ఎదురవుతున్నాయని, ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు సెక్రటరీల నేపథ్యం, వారి పూర్తివివరాలను సేకరి ంచాలని అధికారులను ఆదేశించారు. పాలసేకరణ కేంద్రం, డాక్‌ వద్ద తీస్తు న్న నమూనాలను పరీక్షించగా వెన్న, ఎస్‌ఎ్‌సఎఫ్‌ శాతాల్లో వస్తున్న తేడాల పై కలెక్టర్‌ ప్రస్తావించారు. మిషన్ల క్యా లిబిరేషన్‌పై సందేహాలను అధికారులు కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. అవసరమైతే థర్డ్‌ పార్టీతో సర్టిఫికేషన్‌ చేయించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపా రు. ఏఎంసీయూల నిర్వహణ ఖర్చుల ను అమూల్‌ సంస్థ ఇంత వరకు సొసైటీలకు మంజూరుచేయలేదని అధికారులు తెలిపారు. దీ నిపై కలెక్టర్‌ మాట్లాడుతూ ఆ నిధులు త్వరగా మంజూర య్యే విధంగా చర్య లు తీసుకోవాలని ఆ దేశించారు. జేసీ  చే తన్‌, సబ్‌ కలెక్టర్‌ భార్గవతేజ, శీనారెడ్డి, బేబిరాణి,  నోడల్‌ అ ధికారిహనుమంతరా వు, ఆర్డీవో ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.


Updated Date - 2021-02-26T05:52:23+05:30 IST