చురుగ్గా సాగుతున్న సర్వే

ABN , First Publish Date - 2020-10-20T06:16:16+05:30 IST

నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లోని ఆయా మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలలో ఆస్తుల సర్వే చురుగ్గా సాగుతోంది. పట్ట ణాల్లో ఆస్తుల వివరాల నమోదు ప్రక్రియను సంబంధిత శాఖ అధికా రులు మరింత వేగం పెంచారు

చురుగ్గా సాగుతున్న సర్వే

పట్టణాల్లో పూర్తికావస్తున్న ఆస్తుల వివరాల నమోదు ప్రక్రియ

ఉమ్మడి జిల్లాలోని మున్సిపాటీల్లో 70 శాతం ఆస్తుల సర్వే

ధరణి పోర్టల్‌లోకి వ్యవసాయేతర ఆస్తుల వివరాలు 

నేటితో ముగియనున్న గడువు


కామారెడ్డి అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లోని ఆయా మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలలో ఆస్తుల సర్వే చురుగ్గా సాగుతోంది. పట్ట ణాల్లో ఆస్తుల వివరాల నమోదు ప్రక్రియను సంబంధిత శాఖ అధికా రులు మరింత వేగం పెంచారు. దస రాకళ్లా ధరణి పోర్టల్‌ను ప్రారంభించను న్న నేపథ్యంలో మంగళవారం కల్లా ఆన్‌ లైన్‌లో ఆస్తుల నమోదు ప్రక్రియ పూర్తిచే సేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఉమ్మ డి జిల్లాలోని ఒక కార్పొరేషన్‌తో పాటు 6 ము న్సిపాలిటీలలో ఇప్పటివరకు 70 శాతానిపైగా ఆస్తుల నమోదు ప్రక్రియ పూర్తయినట్లు అధికా రులు చెబుతున్నారు. గత 20 రోజుల క్రితం వ్య వసాయేతర ఆస్తుల వివరాలు ఆన్‌లైన్‌లో అప్‌లో డ్‌ చేసేందుకు గ్రామపంచాయతీ, మున్సిపాలిటీలో సర్వేకు శ్రీకారం చుట్టారు. వ్యవసాయేతర భూము లకు సైతం ఆన్‌లైన్‌ చేయడంతో పాటు చట్టబద్ధత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగానే ఇటివలే ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రకటిం చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ధరణి పోర్టల్‌లో ఆస్తుల వివరాలు నమోదు చేయడం వల్ల భవిష్యత్తు లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడంతో పాటు వారసులకు బదలాయించేందుకు సైతం సులు వు కానుంది. అక్రమాస్తులు, ఇంటినంబర్ల కేటాయిం పు లేనివి అనుమతి లేని భవనాలు సైతం పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయడం వల్ల అన్ని పకడ్బందీగా జరగడం తో పాటు ప్రభుత్వానికి భారీగా ఆదాయం పెరగనుం ది. దీంట్లో భాగంగా ప్రస్తుతం ప్రజల ఆస్తులను అసె స్‌మెంట్‌(అంచనా) వేయడం, ఆన్‌లైన్‌లో నమోదు చేయడంలో గ్రామపంచాయతీ, మున్సిపల్‌ సిబ్బంది తలమునకలయ్యారు.


70 శాతం పూర్తయిన ఆస్తుల వివరాలు

ఉమ్మడి జిల్లా పరిధిలోని ఏడు మున్సిపాలిటీలలో ఇప్పటివరకు 70 శాతం ఆస్తుల వివరాల నమోదు ప్ర క్రియ పూర్తయినట్లు తెలుస్తోంది. నిజామాబాద్‌ జిల్లా లో కార్పొరేషన్‌తో పాటు మూడు మున్సిపాటీలలో మొత్తం 1,13,858 ఆస్తులు ఉన్నట్లుగా అధికారులు గు ర్తించారు. ఇందులో 64,296 ఆస్తుల వివరాలను అధి కారులు ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. అనగా నిజా మాబాద్‌ జిల్లాలోని మున్సిపాలిటీల ఆస్తుల నమోదు ప్రక్రియ 56.47 శాతం పూర్తయింది. అదేవిధంగా కా మారెడ్డి జిల్లాలోని మూడు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 38,140 వరకు ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో 30,010 ఆస్తుల వివరాలు న మోదు చేయగా 78.68 శాతం పూర్తయినట్లు అఽధికా రుల లెక్కలు చెబుతున్నాయి.


12 అంశాలతో వివరాల నమోదు

నిజామాబాద్‌ కార్పొరేషన్‌, బోధన్‌, ఆర్మూర్‌, భీమ్‌గ ల్‌, కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో ని అన్ని వార్డులలో 12 అంశాలతో కూడిన వివరాలు సేకరిస్తున్నారు. ప్రజల ఆస్తుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడంపై రాష్ట్ర ఉన్నతాధికారులు ఇటీవల అన్ని జిల్లాల ఉన్నతాధికారులతో పాటు ఆయాశాఖ అధికారులకు వివరించారు. ప్రజల ఆస్తులన్నింటినీ ఆన్‌లైన్‌లో నమోదు చేయడంపై తగు చర్యలు చేప ట్టాలని ఆదేశించడంతో పాటు అనుమతి ఉన్న, లేని ప్రతి ఆస్తిని ఐదారు రోజుల్లో పోర్టల్‌లో ఎంటర్‌చేయా లని సూచించడంతో గ్రామపంచాయతీ, మున్సిపాల్‌ అధికారులు ఇళ్లలో కొలతలు వేసి ఆస్తుల వివరాలు, యజమానుల నుంచి ఆధార్‌, మొబైల్‌ నంబర్‌, కుటు ంబసభ్యులకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నా రు. ప్రతి గ్రామం, పట్టణాల్లోని ప్రతీ వార్డులోనూ మి స్‌ అయిన నిర్మాణాలను గుర్తించి ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. వ్యవసాయభూము ల్లో ఉన్న ఇళ్లు, పాఠశాల, ఆసుపత్రి, అంగన్‌వాడీ కేం ద్రం, దాబాలు, హోటళ్లు, గుడులు ఇలా ప్రతిదాన్ని న మోదు చేస్తున్నారు.


గృహ, వాణిజ్యసముదాయాలు ధరణి పోర్టల్‌లోకి

తాజాగా చేపట్టిన సర్వేలో నాన్‌ అగ్రికల్చర్‌ ప్రాపర్టీ కింద గృహ, వాణిజ్య సముదాయల భవనాలు, ప్లాట్ల వివరాలతో పాటు తదితర అంశాలను నమోదు చే యనున్నారు. ఈ మేరకు గ్రామపంచాయతీ, మున్సిప ల్‌ అధికారులు బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో సర్వే చేపడుతున్నారు. అసెస్‌మెంట్‌కు సంబంధించి ఒక ప్రొఫార్మాతో సర్వే నిర్వహిస్తూ పలు అంశాల ఆధారం గా వివరాలను నమోదు చేసుకుంటూ ఇంటి కొలత లు సేకరిస్తున్నారు. యజమాని చనిపోతే వారసుల పేరిట మ్యూటేషన్‌ చేయాల్సి వస్తే ముందుగా డిపెం డెంట్‌ వివరాలు తీసుకుంటున్నారు. వారి సమ్మతితో ఎలాంటి వివాదం లేకుంటే మ్యూటేషన్‌ చేసేందుకు క సరత్తు చేస్తున్నారు. ఇక ఇంటి పరంగా ఇండిపెండెం ట్‌ హౌజా.. అపార్ట్‌మెంట్‌లోనిదా అనే వివరాలను తీసుకుంటున్నారు.


ఆర్‌సీసీ బిల్డింగా సెకండ్‌ ఫ్లోర్‌లో ఉందా తదితర అంశాలపై సర్వే నిర్వహిస్తున్నారు. అ యితే ఈ సర్వేపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకున్నా రకర కాల ఊహగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం లెక్కి స్తున్న వ్యవసాయేతర ఆస్తుల ప్రకారమే రానున్న రో జుల్లో ఆస్తిపన్ను విధిస్తారని తెలుస్తోంది. అయితే అ న్ని వివరాలు పక్కాగా ఉండేందుకు సర్వే చేపడుతు న్నట్లు అధికారులు తెలుపుతున్నారు. ప్రస్తుతం వివ రాలు తెలపకపోతే తర్వాతి రోజుల్లో ఇబ్బందులు పడా ల్సి వస్తుందని అధికారులు అంటున్నారు. ధరణి వైబ్‌ సైట్‌లో వివరాలు నమోదైతేనే రిజిస్ట్రేషన్‌ ఉంటుందని వెల్లడిస్తున్నారు. అలాగే వ్యవసాయ భూములతో పా టు వ్యవసాయేతర ఆస్తుల లెక్క సైతం పక్కాగా ఉం టుందని తెలుపుతున్నారు. ఈ మేరకు ప్రజలు సిబ్బం దికి సహకరించాలని కోరుతున్నారు. కాగా ఈ సర్వేను అక్టోబరు 10లోగా ముగించాలని తొలుత నిర్ణయించిన ప్రభుత్వం ఈనెల 20 గడువును పొడిగించింది. మం గళవారంతో ఆ గడువు కూడా ముగియనుంది.

Updated Date - 2020-10-20T06:16:16+05:30 IST