Lottery ticket: పుట్టిన తేదీ, నెల, సంవత్సరం ఆధారంగా.. లాటరీ టికెట్లు కొన్న వ్యక్తి పరిస్థితి.. చివరకు ఏమైందంటే..

ABN , First Publish Date - 2022-09-29T23:19:49+05:30 IST

అమెరికాలోని వర్జీనియాకు (America Virginia) చెందిన ఆలీగామీ అనే వ్యక్తిని అదృష్టం వరిచింది. తరచూ లాటరీ టికెట్లు కొని విసిగిపోయిన ఇతను.. ఇటీవల ఒక్కసారిగా...

Lottery ticket: పుట్టిన తేదీ, నెల, సంవత్సరం ఆధారంగా.. లాటరీ టికెట్లు కొన్న వ్యక్తి పరిస్థితి.. చివరకు ఏమైందంటే..

కొందరు కొన్ని రకాల సెంటిమెంట్లను (sentiments) బలంగా నమ్ముతారు. కొన్నిసార్లు అనుకోకుండా అదృష్టం తలుపు తట్టినప్పుడు.. అదే సెంటిమెంట్ పని చేసిందని సంబరపడిపోతుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. సంఖ్యా శాస్త్రాన్ని బలంగా నమ్మే ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. పుట్టిన తేదీ, నెల, సంవత్సరం ఆధారంగా ఓ వ్యక్తి పలు లాటరీ టికెట్లను కొన్నాడు. చివరకు ఆ నమ్మకమే.. తనను కోటీశ్వరుడిని చేసిందని సంబరపడిపోతున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social media) హాట్‌టాపిక్‌గా మారిపోయాడు. ఇంతకీ అతను ఎవరు, లాటరీలో ఎంత గెలుచుకున్నాడు.. అనే వివరాల్లోకి వెళితే..


అమెరికాలోని వర్జీనియాకు (America Virginia) చెందిన ఆలీగామీ అనే వ్యక్తిని అదృష్టం వరిచింది. తరచూ లాటరీ టికెట్లు కొని విసిగిపోయిన ఇతను.. ఇటీవల ఒక్కసారిగా కోటీశ్వరడయ్యాడు. ఎలాగైనా లాటరీలో డబ్బు గెలుచుకోవాలనే ఉద్దేశంతో ఇటీవల అతను తన పుట్టిన రోజు, నెల, ఏడాది ఆధారంగా సుమారు 200లాటరీ టికెట్లను కొన్నాడు. వర్జీనియాలో ఒక్కో లాటరీ టిక్కెట్టును (Lottery ticket) డాలర్ పెట్టి కొన్నాడు. అన్ని టికెట్లలో 0-2-6-5 సంఖ్యలు ఉండేలా చూసుకున్నాడు. అదేవిధంగా అందులో ఒకే నంబర్‌పై మూడు టికెట్లను కొనుగోలు చేశాడు. చివరకు తాను కొన్న టికెట్‌తో జాక్‌పాట్ కొట్టాడు. ఏకంగా 1మిలియన్ డాలర్లు (సుమారు రూ.8కోట్లు) గెలుచుకున్నాడు. దీంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

శ్రీనివాస రామానుజన్ మళ్లీ పుట్టారా..? ఈ బాలుడు చదివేది 3వ తరగతే.. కానీ పదో తరగతి విద్యార్థులకు కూడా లెక్కల పాఠాలు..!


గతంలో మేరీల్యాండ్‌కు చెందిన 67 ఏళ్ల వ్యక్తి లాటరీలో $150,000 (రూ.1.2 కోట్లు) గెలుచుకున్నాడు. ఇక్కడ విశేషం ఏంటంటే.. ఈ వ్యక్తి ఒకే నంబర్‌పై మూడు టికెట్లను కొనుగోలు చేశాడు. సెప్టెంబర్ 22న వచ్చిన ఫలితాల్లో ఆయన ఈ మొత్తాన్ని సొంతం చేసుకున్నాడు. అదేవిధంగా ఇటీవల కేరళలోని అనూప్ అనే ఆటో డ్రైవర్ రూ.25కోట్ల ఓనం బంపర్ లాటరీ (Kerala Onam Lottery) గెలుచుకున్న విషయం తెలిసిందే. కుటుంబ పోషణ నిమిత్తం మలేషియా వెళ్లి చెఫ్‌గా పని చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో రూ.3లక్షల రుణం కోసం కూడా దరఖాస్తు చేసుకున్నాడు. దరఖాస్తుకు ఆమోదం లభించిన మరుసటి రోజే అతను రూ.25కోట్లు గెలుచుకున్నాడు. రూ.500 పెట్టి టికెట్ కొనే క్రమంలో అనూప్ వద్ద రూ.50 తక్కువ పడటంతో తన కుమారుడి కిడ్డీ బ్యాంకును పగులగొట్టి తీసుకున్నాడు. చివరకు కోట్లు గెలుచుకోవడంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

నా పిల్లలు నాకు కావాలి.. ఎవరో ఎత్తుకెళ్లారంటూ పోలీసుల ముందు ఏడ్చిందో తల్లి.. 5 రోజుల తర్వాత ఏం తేలిందంటే..



Updated Date - 2022-09-29T23:19:49+05:30 IST