కొడుకు పుడతానుకుంటే.. కూతురు పుట్టింది.. చివరకు భర్త కొనిచ్చిన ఫోన్‌లో వెతికి, వెతికి ఇలా చేసింది..

ABN , First Publish Date - 2021-10-25T03:11:40+05:30 IST

మధ్యప్రదేశ్‌ ఉజ్జయినిలో భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. గర్భం దాల్చినప్పటి నుంచి కొడుకు పుట్టాలని భార్య కలలు కనేది. అయితే ఇటీవల పండంటి కూతురికి జన్మనిచ్చింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులంతా సంతోషపడ్డారు. కానీ

కొడుకు పుడతానుకుంటే.. కూతురు పుట్టింది.. చివరకు భర్త కొనిచ్చిన ఫోన్‌లో వెతికి, వెతికి ఇలా చేసింది..

కొందరు అనుకున్నది జరగపోతే తట్టుకోలేరు. వారు అనుకున్నది సాధించడానికి ఎంతకైనా తెగిస్తారు. ఈ మనస్థత్వం వల్ల చాలా మంది ఉన్నత స్థానానికి వెళ్తుంటే.. కొందరు మాత్రం చేయకూడని పనులు చేసి చివరకు జైలు పాలవుతుంటారు. మధ్యప్రదేశ్‌లో గర్భం దాల్చిన ఓ మహిళకు కొడుకు పుట్టాలని కోరిక ఉండేది. కానీ ఆమెకు కూతరు పుట్టింది. తను అనుకున్నది జరగకపోవడంతో తట్టుకోలేకపోయింది. వెంటనే భర్త కొనిచ్చిన స్మార్ట్ ఫోన్ తీసుకుని, అందులో పలు విధానాల గురించి వెతికింది. చివరకు ఏం చేసిందంటే..


మధ్యప్రదేశ్‌ ఉజ్జయినిలో భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. గర్భం దాల్చినప్పటి నుంచి కొడుకు పుట్టాలని భార్య కలలు కనేది. అయితే ఇటీవల పండంటి కూతురికి జన్మనిచ్చింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులంతా సంతోషపడ్డారు. కానీ తల్లిలో మాత్రం కొంచెం కూడా ఆనందం కనపడలేదు. తాను అనుకున్నది జరగలేదని.. కూతురిపై ద్వేషం పెంచుకుంది. పాపకు మూడు నెలల వయసు వచ్చినా ఆమె ఒక్కరోజు కూడా దగ్గరికి తీయలేదు. ఈ క్రమంలోనే భర్త కొత్త స్మార్ట్ ఫోన్ కొనిచ్చాడు. అనుమానం రాకుండా పాపను ఎలా చంపాలి అనే అంశంపై ఫోన్‌లో రోజూ శోధించేది.


పాప శరీరంపై గాయాలు కాకుండా ఎలా చంపాలి అనే దానిపై ఇంటర్నెట్‌లో రోజూ చూసి.. చివరకు ఒక నిర్ణయానికి వచ్చింది. ఈ నెల 12న పాపను తీసుకెళ్లి నీటి తొట్టిలో ముంచింది. అభం శుభం ఎరుగని ఆ చిన్నారి.. చివరకు నీటిలో ఊపిరాడక మృతిచెందింది. తర్వాత పాప పలకడం లేదంటూ ఏడుపు మొదలెట్టింది. అయితే ఆమె ముఖంలో బాధ లేకపోవడం, ప్రవర్తనలో మార్పు ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారంగా విషయం బయటపడింది. ఇలాంటి క్రూరమైన మహిళలకు కఠిన శిక్ష వేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Updated Date - 2021-10-25T03:11:40+05:30 IST