టీఆర్‌ఎస్‌ పాలనకు చరమగీతం పాడాలి

ABN , First Publish Date - 2021-04-12T07:14:48+05:30 IST

సాగర్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి జానారెడ్డిని గెలిపించి రాష్ట్రంలో సాగుతున్న నిరంకుశ పాలనకు చరమగీతం పాడేందుకు నాంది పలకాలని పీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు.

టీఆర్‌ఎస్‌ పాలనకు చరమగీతం పాడాలి
గుర్రంపోడు మండలంలో ప్రచారంలో మాట్లాడుతున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

గుర్రంపోడు, ఏప్రిల్‌ 11: సాగర్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి జానారెడ్డిని గెలిపించి రాష్ట్రంలో సాగుతున్న నిరంకుశ పాలనకు చరమగీతం పాడేందుకు నాంది పలకాలని పీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. మండలంలోని చేపూర్‌, తేరాటిగూడెం, గుర్రంపోడు, కొప్పోల్‌, పోచంపల్లి, శాఖాజీపురం, పాల్వాయి, మునీ్‌ఫఖాన్‌గూడెం, కాల్వపల్లి గ్రామాల్లో ఆదివారం నిర్వహించిన ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో అవినీతి డబ్బుతో ఓట్లను కొనుగోలు చేస్తున్నారని, దీన్ని ప్రజలు తిప్పికొట్టాలని అన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల గుర్తు కారు కాకుండా కరెన్సీగా మార్చుకోవాలని సూచించారు. జానారెడ్డి పుణ్యంతోనే కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యారన్నారు. రాష్ట్రంలో అవినీతి మచ్చలేని నాయకుడు జానారెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత నియోజకవర్గ ప్రజలపై ఉందన్నారు. రైతురుణమాఫీ, ఉద్యోగాలు, డబుల్‌బెడ్‌ ఇళ్ల హామీలను సీఎం కేసీఆర్‌ విస్మరించారన్నారు. ప్రభుత్వం మెడలు వంచేందుకు శాసనసభలో జానారెడ్డి లాంటి నాయకుడు ఉండాలన్నారు. జానాను గెలిపించి టీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పాలన్నారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ, ఎందరో అమరుల త్యాగ ఫలంతో వచ్చిన తెలంగాణలో నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు. ఈ ప్రాంత అభివృద్థికి కృషి చేసిన జానారెడ్డిని ఉప ఎన్నికలో గెలిపించాలన్నారు. అనంతరం జానారెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వాల హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప ఏడేళ్లుగా నియోజకవర్గంలో కొత్తగా జరిగిందేమీ లేదన్నారు. రానున్న రోజుల్లో సుపరిపాలన అందించేందుకు కాంగ్రెస్‌ను గెలిపించాలన్నారు. కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యుడు శ్రీనివా్‌సకిషన్‌, బాలు నాయక్‌, పార్టీ మండల అధ్యక్షుడు కంచర్ల వెంకటేశ్వర్‌రెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, కుప్ప రాములు, చినసత్తమయ్య, కాటేపల్లి రాధక్రిష్ణ, వెంకటేశ్వర్లు, అమరెందర్‌, వెంకన్న తదితరు నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-12T07:14:48+05:30 IST