ఎఫ్‌ఆర్‌వోపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

ABN , First Publish Date - 2022-05-25T03:50:28+05:30 IST

ఆదివాసి గిరిజన మహిళలపై దురుసుగా ప్రవర్తించి, దూషించిన తాళ్ళపేట ఎఫ్‌ఆర్‌వోపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి సంకే రవి డిమాండ్‌ చేశారు. మంగళ వారం సీపీఎం, రైతు కార్మిక సంఘం ఆధ్వర్యంలో కోయపోచగూడకు చెందిన 19 మంది గిరిజన మహిళలు పోడు భూముల కోసం పోరాడిన వారిని సన్మానించారు.

ఎఫ్‌ఆర్‌వోపై  అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
కోయపోచగూడలో గిరిజన మహిళలకు పుష్పగుచ్ఛాలు ఇస్తున్న సీపీఎం నాయకులు

 దండేపల్లి,మే 24 : ఆదివాసి గిరిజన మహిళలపై దురుసుగా ప్రవర్తించి, దూషించిన తాళ్ళపేట ఎఫ్‌ఆర్‌వోపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ  కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి సంకే రవి డిమాండ్‌ చేశారు. మంగళ వారం సీపీఎం, రైతు కార్మిక సంఘం ఆధ్వర్యంలో కోయపోచగూడకు చెందిన 19 మంది గిరిజన మహిళలు పోడు భూముల కోసం పోరాడిన వారిని సన్మానించారు. సంకే రవి మాట్లాడుతూ అడవిని నమ్ముకుని బతికే ఆదివాసి గిరిజనులపై దాడులు, మహిళలను అరెస్టు చేయడం సరికాదన్నారు. 2006 అటవీ హక్కుల చట్టాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సాగు చేసుకుంటున్న భూములను క్రమబద్దికరించాల్సింది పోయి ప్రభుత్వం పోడు భూములను స్వాధీనం చేసుకోవడం దారుణమన్నారు. ఆదివాసి గిరిజను లపై నిర్బంధాలు కొనసాగుతున్నా ఎమ్మెల్యే దివా కర్‌రావు పట్టించుకోవడం లేదన్నారు. సీఎం కేసిఆర్‌ పోడు భూములకు పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయడంలో విఫలమయ్యారన్నారు. గిరిజనులకు పోడు భూములు ఇచ్చే వరకు సీపీఎం పోరాడుతుందన్నారు.  జిల్లా నాయకులు కనికారపు అశోక్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఫిరంగి జైలు,నాయకులు లచ్చగౌడ్‌,  ప్రకాష్‌, అబ్దుల్లా, ఆదివాసి గిరిజనులు పాల్గొన్నారు.         

Updated Date - 2022-05-25T03:50:28+05:30 IST