వాగులో ఒరిగిన విద్యుత స్తంభం

ABN , First Publish Date - 2022-08-07T05:07:47+05:30 IST

మండలంలోని ఆర్‌ మరువపల్లి పెద్దవంక ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఉప్పొంగుతోంది. శనివారం కూడా నీటి ఉధృతి తగ్గలేదు.

వాగులో ఒరిగిన విద్యుత స్తంభం
ఆర్‌ మరువపల్లి పెద్దవంక నీటి ఉధృతికి ఒరిగిన విద్యుత స్తంభం

రొద్దం, ఆగస్టు 6: మండలంలోని ఆర్‌ మరువపల్లి పెద్దవంక ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఉప్పొంగుతోంది. శనివారం కూడా నీటి ఉధృతి తగ్గలేదు. వంకలో ఏర్పాటు చే సిన 11 కేవీ విద్యుత స్తంభం ప్రమాదకరంగా మారింది. ప్రవాహం ధాటికి ఒకవైపునకు ఒరిగింది. వాగులో నీరు ఆగే వరకు విద్యుత స్తంభం పనులు చేయడానికి వీలులేకుండా ఉంది. దీంతో విద్యుత అధికారులు ఆలైనుకు సంబంధించి విద్యుత సరఫరాను ఆపేస్తే ప్రమాదం తప్పుతుందని గ్రామస్థులు అభిప్రాయపడుతున్నారు. 


Updated Date - 2022-08-07T05:07:47+05:30 IST