Viral video: ఎన్‌క్లోజర్‌లో పడిపోయిన చిన్నారి చెప్పు.. ఆ ఏనుగు ఏం చేసిందో చూడండి..!

ABN , First Publish Date - 2022-08-18T02:08:46+05:30 IST

జంతువులకు సంబంధించిన ఆసక్తికర, ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

Viral video: ఎన్‌క్లోజర్‌లో పడిపోయిన చిన్నారి చెప్పు.. ఆ ఏనుగు ఏం చేసిందో చూడండి..!

జంతువులకు సంబంధించిన ఆసక్తికర, ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఏనుగులకు (elephant) సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఏనుగు ప్రవర్తన నెటిజన్లను ఫిదా చేసింది. చైనాలోని ఓ జంతు ప్రదర్శనశాలలో (China Zoo)ఈ వీడియోను చిత్రీకరించారు. 


జంతు ప్రదర్శనశాలకు వచ్చిన ఓ చిన్నారి చెప్పు అనుకోకుండా ఏనుగులు ఉండే ఎన్‌క్లోజర్‌లో పడిపోయింది. ఆ చెప్పును చూసిన ఏనుగు తన తొండంతో ఆ చెప్పును తీసి బయట ఉన్న చిన్నారికి అందించింది. పర్యాటకులు ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో బాగా వైరల్ (Viral Video) అయింది. ఏనుగు ప్రవర్తనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.  

Updated Date - 2022-08-18T02:08:46+05:30 IST