సూపర్ హెల్మెట్.. ఇది ఉండగా బైక్ చోరీ కావడం అసాధ్యమే.. ఓ విద్యార్థి వినూత్న ప్రయత్నం..!

ABN , First Publish Date - 2022-07-06T00:18:51+05:30 IST

నేటి యువత బైకులపై నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం రోజూ చూస్తూనే ఉన్నాం. కొన్నిసార్లు ఒకే బైకుపై ఐదుగురు, ఆరుగురు ప్రయాణించడం కూడా చూస్తుంటాం. ఇక డ్రంకెన్ డ్రైవ్ కేసులకైతే లెక్కే లేదు..

సూపర్ హెల్మెట్.. ఇది ఉండగా బైక్ చోరీ కావడం అసాధ్యమే.. ఓ విద్యార్థి వినూత్న ప్రయత్నం..!

నేటి యువత బైకులపై నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం రోజూ చూస్తూనే ఉన్నాం. కొన్నిసార్లు ఒకే బైకుపై ఐదుగురు, ఆరుగురు ప్రయాణించడం కూడా చూస్తుంటాం. ఇక డ్రంకెన్ డ్రైవ్ కేసులకైతే లెక్కే లేదు. ఒక్కోసారి ఈ కేసులు.. పోలీసులకు పెద్ద తలనొప్పగా మారుతుంటాయి. అయితే ఈ సమస్యలన్నింటికీ ఒకే ఒక్క హెల్మెట్‌తో చెక్ పెట్టొచ్చు అని ఓ యువకుడు నిరూపించాడు. తాను రూపొందించిన సూపర్ హెల్మెట్ ధరించడం ద్వారా.. ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే..


బీహార్ రాష్ట్రం కిల్కారీకి చెందిన రాజ్ కుమార్ కేశరి.. హాజీపూర్‌లోని CIPET కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఇతడి తండ్రి మొబైల్ రీచార్జ్ షాపు నడుతున్నాడు. రాజ్ కుమార్.. ఇటీవల చదువుతో పాటూ కేశరి ఒన్నోవేషన్ హబ్ ఆన్‌లైన్ తరగతులకు హాజరవుతున్నాడు. ఇందులో రోబోటిక్స్, ఎలక్ట్రానిక్స్‌కు సంబంధించిన అంశాలపై బోధిస్తారు. ఇదిలావుండగా, రాజ్ కుమార్.. ఇటీవల త్రీ రూల్ ట్రాఫిక్ సిస్టమ్‌తో కూడిన స్మార్ట్ హెల్మెట్‌ను తయారు చేశాడు. ఇది బైక్ చోరీకి గురికాకుండా కాపాడుతుంది. అలాగే మద్యం తాగి డ్రైవ్ చేయడాన్ని నిరోధిస్తుంది. అదేవిధంగా దీన్ని ధరిస్తే.. ట్రిపుల్ రైడింగ్ చేయడం కూడా సాధ్యం కాదు. హెల్మెట్‌లో అమర్చిన సెన్సార్ వల్ల బైక్‌కు ఐదు మీటర్ల పరిధిలో ఉంటేనే స్టార్ట్ అవుతుంది. లేదంటే డూప్లికేట్ కీని ఉపయోగించినా బండి స్టార్ట్ అవదు. మద్యం సేవించి బండిపై కూర్చుంటే ఈ సెన్సార్ పసిగట్టేస్తుంది. తద్వారా ఎంత ప్రయత్నించినా బండి మాత్రం స్టార్ట్ అవదు.

నిబంధనలు ఉల్లంఘించి.. డేంజరస్ స్టంట్ చేసిన బైకర్.. కాస్త పట్టు తప్పుంటే పెద్ద ప్రమాదమే జరిగుండేది..


ఈ హెల్మెట్‌లో ఇద్దరు వ్యక్తుల సగటు బరువు సెట్ చేయబడి ఉంటుంది. ఈ కారణంగా బైకుపై ముగ్గురు కూర్చోవడం సాధ్యం కాదు. రూ.1600తో ఈ హెల్మెట్‌ను రూపొందించినట్లు విద్యార్థి తెలిపాడు. నవంబర్ 25నుంచి 27వరకూ గోవాలో అంతర్జాతీయ స్థాయిలో.. ఇండియన్ యంగ్ ఇన్నోవేటర్, ఇన్వెంటర్ ఛాలెంజ్ అనే కార్యక్రమం జరగనుంది. ఇందులో వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు.. తాము రూపొందించిన ప్రాజెక్ట్‌లను ప్రదర్శిస్తారు. ఈ ఈవెంట్‌కు రాజ్ కుమార్ కేశరి, బోరింగ్ రోడ్‌కు చెందిన అర్పిత్, అక్షత్ కుమార్ ప్రాజెక్ట్‌లు ఎంపికయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈవెంట్‌లో ప్రదర్శించబడే ప్రాజెక్ట్‌లను ముందుకు తీసుకెళ్లేందుకు పలువురు పెట్టుబడిదారులు కూడా ముందుకు వస్తారు. కాగా, వినూత్నమైన హెల్మెట్‌ను రూపొందించిన రాజ్ కుమార్‌ను.. పాట్నా ట్రాఫిక్ ఎస్పీ అనిల్ కుమార్ అభినందించారు. ఈ ప్రాజెక్ట్‌ను మార్కెట్‌లోకి తీసుకెళ్లేందుకు సహరిస్తామని హామీ ఇచ్చారు.

అంత పెద్ద ప్రమాదం జరిగినా.. రోడ్డుపై ఆసనాలు వేస్తున్న యువకుడు.. వీడికేమైనా పిచ్చా.. అంటున్న నెటిజన్లు..

Updated Date - 2022-07-06T00:18:51+05:30 IST