డబ్బుల కోసం ఔత్సాహిక దర్శకుడి హైటెక్ ప్లాన్.. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో బట్టబయలైన అసలు నిజం..

ABN , First Publish Date - 2022-01-20T23:56:13+05:30 IST

సినిమా దర్శకుడు కావాలనేది అతడి కల. అందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఈ క్రమంలో షార్ట్‌ఫిల్మ్‌ల పేరుతో లక్షల రూపాయలు ఖర్చు చేశాడు. అయినా అతడి కల మాత్రం నెరవేరలేదు. మరోవైపు అప్పులు ఇచ్చిన వారు..

డబ్బుల కోసం ఔత్సాహిక దర్శకుడి హైటెక్ ప్లాన్.. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో బట్టబయలైన అసలు నిజం..
ప్రతీకాత్మక చిత్రం

సినిమా దర్శకుడు కావాలనేది అతడి కల. అందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఈ క్రమంలో షార్ట్‌ఫిల్మ్‌ల పేరుతో లక్షల రూపాయలు ఖర్చు చేశాడు. అయినా అతడి కల మాత్రం నెరవేరలేదు. మరోవైపు అప్పులు ఇచ్చిన వారు తిరిగివ్వమని ఒత్తిడి చేస్తున్నారు. ఏవేవో సాకులు చెబుతూ రోజులు నెట్టుకొస్తున్నాడు. తన దర్శకత్వం కల మాత్రం కలగానే మిగిలిపోయింది. ఎలాగైనా తాను అనుకున్నది సాధించాలని నిర్ణయించుకున్నాడు. అలాగే తన అప్పులు కూడా తీర్చాలని హైటెక్ ప్లాన్ వేశాడు. చివరకు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..


చెన్నై వడపళని ఐస్ హౌస్ ప్రాంతానికి చెందిన పెన్సిలయ్యకు కృష్ణప్రసాద్(24) అనే కుమారుడు ఉన్నాడు. పెన్సిలయ్య వ్యాపారం చేస్తూ డబ్బులు బాగా సంపాదించాడు. అయితే కొడుకు మాత్రం సినిమా దర్శకుడు కావాలనే కోరికతో బాధ్యతలు మరచి తిరిగేవాడు. ఈ క్రమంలో తెలిసిన వారి వద్ద ఇష్టమొచ్చినట్లు అప్పులు చేసి.. షార్ట్‌ఫిల్మ్‌లు తీశాడు. మిగిలిన డబ్బులతో జల్సాలు చేసేవాడు. కొన్నాళ్లకు అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి ప్రారంభమైంది. డబ్బులు తిరిగి ఇవ్వాలని గట్టిగా అడుగుతుండడంతో ఆలోచనలో పడ్డాడు. ఎలాగైనా అప్పులు తీర్చి, తన దర్శకత్వ కలను నెరవేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు.

ప్రియురాలి కోసం రూ.4కోట్ల రింగ్ తీసుకున్నాడు.. ఇవ్వడానికి కాస్త ముందే ఆమె గురించి తెలిసి.. హమ్మయ్య అనుకున్నాడు..


జనవరి 13న ఓ కారును అద్దెకు తీసుకుని, తన మేనల్లుడిని తీసుకుని వడపళనిలోని ఓ షాపింగ్ మాల్ వద్ద కారు ఆపాడు. సినిమా అవకాశాల కోసం ఏవీఎం స్టూడియోకి వెళ్తున్నానని చెప్పి.. మేనల్లుడిని కారులోనే ఉండమన్నాడు. అక్కడి నుంచి హైదరాబాద్ బస్సు ఎక్కాడు. వెళ్తూ వెళ్తూ మేనల్లుడికి కాల్ చేసి, తనను ఎవరో కిడ్నాప్ చేశారంటూ.. ఫోన్ చేసి వెంటనే కట్ చేశాడు. సికింద్రాబాద్‌‌లో లాడ్జి తీసుకుని అసలు నాటకం మొదలెట్టాడు. తల్లిదండ్రులకు ఫోన్ చేసి, తనను ఎవరో కిడ్నాప్ చేశారని.. రూ.30లక్షలు ఇస్తేనే వదులుతారని, లేదంటే చంపేస్తామంటున్నారని బోరున విలపించాడు. దీంతో కంగారుపడ్డ పెన్సిలయ్య.. వడపళని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫోన్ నంబర్ ఆధారంగా సికింద్రాబాద్‌లోని కృష్టప్రసాద్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. అసలు నిజం బయటపడింది. దీంతో అతడికి కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు.

సెల్ఫీలను అమ్ముతూ రూ.కోట్లు సంపాదిస్తున్న యువకుడు.. ఎలాగో తెలుసుకుంటే అవాక్కవుతారు..

Updated Date - 2022-01-20T23:56:13+05:30 IST