రూ.2.7 లక్షల కోట్ల అప్పుపై వివరణ ఇవ్వాలి

ABN , First Publish Date - 2022-07-03T09:05:38+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

రూ.2.7 లక్షల కోట్ల అప్పుపై వివరణ ఇవ్వాలి

  • రాష్ట్ర ప్రజలకు కేసీఆర్‌ సమాధానం చెప్పాలి
  • కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల దుర్వినియోగం
  • తెలంగాణలో మహిళలు, బాలిక లపై అఘాయిత్యాలు
  • వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం.. టూరిస్టుగా కేసీఆర్‌
  • మీడియాతో కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌
  • ఫాంహౌ్‌సలో పడుకుంటే సరిపోదు


హైదరాబాద్‌, జూలై 2, (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి కేసీఆర్‌పై, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి ఫాంహౌ్‌సలో పడుకోవడం కాదని, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొనేందుకు హైదరాబాద్‌ వచ్చిన అనురాగ్‌ ఠాకూర్‌ శనివారం మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ‘‘తెలంగాణ ధనిక రాష్ట్రం. అయినా రూ.2.5 లక్షల కోట్ల అప్పు ఎందుకు చేశారు? హైదరాబాద్‌లో మహిళలు, బాలికలు ధైర్యంగా తిరిగే పరిస్థితి లేదు. ఐటీ నగరంలో ఒక మహిళ ఉద్యోగం చేసి ఇంటికెళ్లే పరిస్థితి లేనివిధంగా శాంతిభద్రతలు ఉన్నాయంటే.. ఇంతకంటే సిగ్గుచేటు ఇంకేముంటుంది? పెట్టుబడులు ఎలా వస్తాయి?’’ అని ప్రశ్నించారు. మోదీ ఒక పొలిటికల్‌ టూరిస్ట్‌ అన్న టీఆర్‌ఎస్‌ విమర్శలపై ప్రశ్నించగా.. ‘‘ఫాంహౌ్‌సలో పడుకునే ముఖ్యమంత్రికి ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న ప్రధాని మోదీ విలు వ ఏం తెలుసు? మోదీకి దేశంలో, అంతర్జాతీయంగా ఉన్న విశ్వసనీయత, ఆదరణ గురించి కేసీఆర్‌ తెలుసుకోవాలి.  వచ్చే ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఖాయం. ఆ తర్వాత కేసీఆర్‌ దేశవ్యాప్తంగా టూరి్‌స్టగా తిరగొచ్చు’’ అని ఠాకూర్‌ వ్యాఖ్యానించారు. 


నిధులన్నీ కేసీఆర్‌ కుటుంబం జేబుల్లోకి..

కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.వేల కోట్ల నిధులు దుర్వినియోగమయ్యాయని, అవన్నీ సీఎం కేసీఆర్‌ కుటుంబం జేబుల్లోకి వెళ్లాయని అనురాగ్‌ ఠాకూర్‌ ఆరోపించారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని, ప్రజల స్థితిగతులేవీ మెరుగుపడలేదని, కేసీఆర్‌ కుటుంబం మాత్రం బాగుపడిందన్నారు. అభివృద్ది అంటే ఒక ్క కేసీఆర్‌ కుటుంబానిదేనా? అని ప్రశ్నించారు. నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపిస్తారా? అని ప్రశ్నించగా.. వ్యవస్థలు వాటి పని అవి చేసుకుపోతాయని చెప్పారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే అవి చేయాల్సిన పని చేస్తాయని పేర్కొన్నారు. రాష్ట్ర ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన దళితులు, అణగారిన వర్గాల జీవితాలు ఇప్పటికీ మారలేదని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోయారని ఆయన అన్నారు.

Updated Date - 2022-07-03T09:05:38+05:30 IST