నిజాయితీ చాటుకున్న యువకుడు

Dec 6 2021 @ 23:40PM
బాధితుడికి బ్యాగును అప్పగిస్తున్న ఎస్‌ఐ రవి

అక్కన్నపేట, డిసెంబరు 6: మండల కేంద్రంలో దొరికిన బ్యాగును పోలీసులకు అప్పగించిన ఓ యువకుడు తన నిజాయితీని చాటుకున్నాడు. సోమవారం అక్కన్నపేట మండల కేంద్రానికి చెందిన సోమ సది అనే యువకుడికి రోడ్డుపై ఓ బ్యాగు దొరికింది. ఆ బ్యాగును పోలీ్‌సస్టేషన్‌లో ఎస్‌ఐ కొత్తపల్లి రవికి అప్పగించాడు. ఆధార్‌కార్డులో ఉన్న వివరాల ప్రకారం ఆ బ్యాగ్‌ కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్‌ గ్రామానికి చెందిన పోతరవేని శ్రీనివా్‌సదిగా గుర్తించి అతడికి సమాచారమందించారు. కాగా ఆ బ్యాగులో ఆధార్‌కార్డుతో పాటు రూ.13వేలు నగదు,  స్మార్ట్‌ఫోన్‌, 1గ్రామ్‌ బంగారు కమ్మలు, దుస్తులు ఉన్నట్టు తెలిపారు. పోలీ్‌సస్టేషన్‌కు వచ్చి నిజాయితీగా బ్యాగును అందజేసిన సదికి రూ.వెయ్యి పారితోషకంగా అందించి అభినందించారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.