నిత్యావసరాల ధరల పెంపు తగదు

ABN , First Publish Date - 2021-03-01T04:56:19+05:30 IST

గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసర ధరలను తగ్గించాలని ఆప్‌ జిల్లా కన్వీనర్‌ కె.దయానంద్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆదివారం జిల్లా కేంద్రంలోని సంతకాల వంతెన వద్ద ఆమ్‌ఆద్మీ పార్టీ నేతలు ఖాళీ గ్యాస్‌బండలతో వినూత్నంగా నిరసన తెలిపారు.

నిత్యావసరాల ధరల పెంపు తగదు
నిరసన తెలుపుతున్న ఆమ్‌ఆద్మీ పార్టీ నేతలు

 విజయనగరం (ఆంధ్రజ్యోతి) ఫిబ్రవరి 28 : గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసర ధరలను తగ్గించాలని ఆప్‌ జిల్లా కన్వీనర్‌ కె.దయానంద్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆదివారం జిల్లా కేంద్రంలోని సంతకాల వంతెన వద్ద ఆమ్‌ఆద్మీ పార్టీ నేతలు ఖాళీ గ్యాస్‌బండలతో వినూత్నంగా నిరసన తెలిపారు.  ధరలు అమాంతం పెంచడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారన్నారు.  ప్రస్తుతం డీజిల్‌ , పెట్రోల్‌ ధరలు సెంచరీకి చేరువలో ఉన్నాయన్నారు.   కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల రూపంలో అధిక మొత్తం వసూలు చేయడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.  మరోవైపు ఉల్లి, నూనె, పప్పు తదితర నిత్యవసర ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయన్నారు.  కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయి పేదలు ఇబ్బందులు పడుతుంటే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధంగా ధరలు పెంచడం భావ్యం కాదన్నారు. వెంటనే ధరలను అదుపు చేయకుంటే రానున్న రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆప్‌ ప్రతినిధులు బి.శ్రీనివాసరావు, పి.సురేష్‌, లోవరాజు తదితరులు  పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-03-01T04:56:19+05:30 IST