వంకలో అనధికారిక లేఔట్‌

ABN , First Publish Date - 2022-08-16T05:30:00+05:30 IST

కడపలో ఖాళీ స్థలం కనిపిస్తే చాలు రియల్టర్లు గద్దల్లా వాలిపోతున్నారు. కడప నగరంలో నివాస స్థలాల ధరలు సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు అందనంత ఎత్తులో ఉన్నాయి. దీంతో శివారు ప్రాంతాల్లో చౌకగా స్థలాలు దొరుకుతాయన్న ఉద్దేశ్యంతో అక్కడ కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. అలాగే కొంత మంది రిటైర్‌ ఉద్యోగులు నగరంలో పొల్యూషన్‌, గజిబిజి ట్రాఫిక్‌ వల్ల శివారు ప్రాంతాల్లో ఇండివిజల్‌ ఇంటిని నిర్మించుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇది రియల్టర్లకు వరంగా మారింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లేఔట్లు వేయాల్సిన రియల్టర్లు డబ్బు సంపాదనే లక్ష్యంగా నిబంధనలకు నీళ్లు వదలడంతో పాటు ప్రభుత్వ భూములను కాజేసి వెంచర్లు వేస్తున్నారు.

వంకలో అనధికారిక లేఔట్‌
చెరువు కాలువలో ప్రహారీ గోడ

వర్షపు నీరు వెళ్లేందుకు అడ్డంకి 

సెంటు రూ.10 లక్షల చొప్పున విక్రయం

(కడప - ఆంధ్రజ్యోతి): కడపలో ఖాళీ స్థలం కనిపిస్తే చాలు రియల్టర్లు గద్దల్లా వాలిపోతున్నారు. కడప నగరంలో నివాస స్థలాల ధరలు సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు అందనంత ఎత్తులో ఉన్నాయి. దీంతో శివారు ప్రాంతాల్లో చౌకగా స్థలాలు దొరుకుతాయన్న ఉద్దేశ్యంతో అక్కడ కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. అలాగే కొంత మంది రిటైర్‌ ఉద్యోగులు నగరంలో పొల్యూషన్‌, గజిబిజి ట్రాఫిక్‌ వల్ల శివారు ప్రాంతాల్లో ఇండివిజల్‌ ఇంటిని నిర్మించుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇది రియల్టర్లకు వరంగా మారింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లేఔట్లు వేయాల్సిన రియల్టర్లు డబ్బు సంపాదనే లక్ష్యంగా నిబంధనలకు నీళ్లు వదలడంతో పాటు ప్రభుత్వ భూములను కాజేసి వెంచర్లు వేస్తున్నారు. 

కడప నగర శివారులోని రామరాజుపల్లెలో ఓ ప్రవేటు కళాశాల వెనుక సుమారు రెండున్న ఎకరాల్లో వెంచర్‌ వెలిసింది. దీనికి అనుమతి లేదు. అనుమతి లేకపోగా.. రామరాజుపల్లె చెరువు నుంచి రాళ్లవంకకు వెళ్లే పంట కాలువను ఆక్రమించి లేఔట్‌లో కలుపుకున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. కాలువను ఆక్రమించేసి చుట్టూ కాంపౌండ్‌వాల్‌ నిర్మించారు. పంట కాలువ అన్యాక్రాంతంపై స్థానికులు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని సమాచారం. పంట కాలువలు, డ్రైనేజీలు ఆక్రమించడం వల్ల కడప నగరం ప్రతిసారి వర్షాకాలంలో ముంపునకు గురవుతూ ఉంది. ప్రస్తుతం రామరాజుపల్లె వద్ద  కాలువ ఆక్రమణకు గురయింది. కాలువను ఆక్రమించేసి వేసిన ఈ లేఔట్‌లో సెంటురూ.10 లక్షలకు అమ్ముతున్నట్లు సమాచారం. 2020, 2021లో వరుసగా నవంబర్‌ నెలలో అధిక వర్షాలు కురిసి కడప వాసులు ఇబ్బంది పడ్డారు. రామరాజుపల్లె ప్రజలు కూడా మునకు గురవుతుందని అప్పట్లో ఆందోళన చెందారు. ఈ ఏడాది అదే స్థాయి వర్షాలు కురిశాయంటే ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే చెరువు నీళ్లు వెళ్లే వంకను కబ్జా చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయం కడప తహసీల్దార్‌ శివరామిరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. 

Updated Date - 2022-08-16T05:30:00+05:30 IST