సీతమ్మ అదృశ్యంపై వీడని మిస్టరీ

ABN , First Publish Date - 2021-12-04T05:22:49+05:30 IST

మంత్రాలయానికి చెందిన సీతమ్మ అదృశ్యంపై మిస్టరీ వీడ లేదు.

సీతమ్మ అదృశ్యంపై వీడని మిస్టరీ

మంత్రాలయం, డిసెంబరు 3: మంత్రాలయానికి చెందిన సీతమ్మ అదృశ్యంపై మిస్టరీ వీడ లేదు. సీతమ్మ ఈ ఏడాది మార్చి 26 నుంచి కనిపించడం లేదని బెంగళూరు సుబ్రహ్మణ్య పోలీసుస్టేషన్‌లో ఆమె తమ్ముడు ఫిర్యాదు చేశారు. ఏడు నెలలైనా సీతమ్మ ఆచూకీని కర్ణాటక పోలీసులు కనుగొనకపోవటంతో కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. అనుమానం ఉన్న నిందితుల పేర్లను కోర్టుకు తెలిపారు. ఈ మేరకు పోలీసులు అన్ని కోణాల్లో విచారించి ఐదుగురిపై కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితులైన శ్రీమఠం అటెండర్‌ నూర్‌అహ్మద్‌, సత్యనారాయణలను మంత్రాలయం తీసుకొచ్చి కేసుతో సంబంధం ఉన్న వారి ఇళ్లలో సోదాలు నిర్వహించారు. సీతమ్మ బంగారు ఆభరణాలను అమ్మిన ఎమ్మిగనూరులోని దుకాణాలను తనిఖీ చేశారు. బెంగళూరు సీఐ సంజీవ్‌గైడ్‌, ఏఎస్‌ఐ నటరాజు, గుణశేఖర్‌లు, కానిస్టేబుళ్లు హనుమంతు, సిద్దరాజులు మంత్రాలయం వచ్చి సీతమ్మను హత్య చేసి ఉండవచ్చని ఆ కోణంలోనే దర్వాప్తు ముమ్మరం చేసినట్లు తెలిపారు. సీతమ్మ అదృశ్యం కేసును త్వరలో ఛేదిస్తామని చెప్పారు. నిందితులు ఉపయోగించిన కారును సీజ్‌ చేసి బెంగళూరుకు తరలించారు. 

Updated Date - 2021-12-04T05:22:49+05:30 IST