
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ లేఖ రాశారు. ఏపీలో పోలీసుల పరిస్థితి దయనీయంగా ఉందని, డీఏ, అలవెన్సులు లేక పోలీసులు ఇబ్బంది పడుతున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. పోలీసులకు ఇచ్చిన వారాంతపు సెలవు హామీని సీఎం జగన్ నిలబెట్టుకోవాలని కోరారు. పోలీసుల సమస్యలపై ముఖ్యమంత్రి దృష్టి సారించాలని ఎమ్మెల్యే అనగాని ఆ లేఖలో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి