
అనకాపల్లి: జిల్లాలోని నక్కపల్లి మండలం గొడిచర్ల జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని టాటా మ్యాజిక్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా... ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని తుని గవర్నమెంట్ హాస్పటల్‌కు తరలించారు. కృష్ణా జిల్లా నుండి విశాఖ సింహాచలం దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి