Ananatapur: ఉద్యోగినిపై ఎస్సీ వెల్ఫేర్ డీడీ దురుసు ప్రవర్తన

ABN , First Publish Date - 2022-06-29T17:30:42+05:30 IST

మహిళా ఉద్యోగినిపై ఎస్సీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ విశ్వమోహన్ రెడ్డి దురుసుగా ప్రవర్తించాడు.

Ananatapur: ఉద్యోగినిపై ఎస్సీ వెల్ఫేర్ డీడీ దురుసు ప్రవర్తన

అనంతపురం: మహిళా ఉద్యోగిని పట్ల అనంతపురం జిల్లా ఎస్సీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ విశ్వమోహన్ రెడ్డి దురుసుగా ప్రవర్తించిన వీడియో వైరల్‌గా మారింది. హాస్టల్ వార్డెన్‌ల బదిలీల్లో శ్రీలక్ష్మీ అనే మహిళా వార్డెన్‌ను  డీడీ అసభ్య పదజాలంతో దూషించాడు. జిల్లాలోని సీపీ కార్యాలయంలో మంగళవారం జరిగిన ఎస్సీ హాస్టల్ వార్డెన్ల బదిలీల కౌన్సెలింగ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. సాధారణ బదిలీల్లో భాగంగా కదిరిలోని మరో హాస్టల్‌కు బదిలీ చేయాలని డీడీని మహిళా వార్డన్ కోరారు. దీంతో వార్డెన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన డీడీ... ‘‘పనికిమాలిన దానా.. బయటకు పో’’ అంటూ చెయ్యెత్తి కొట్టే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం విశ్వమోహన్ రెడ్డి వార్నింగ్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. డీడీ తీరుపట్ల నెటిజన్లు మండిపడుతున్నారు. 

Updated Date - 2022-06-29T17:30:42+05:30 IST