ltrScrptTheme3

Anantapur: రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అనుచరుల వీరంగం

Oct 26 2021 @ 14:22PM

అనంతపురం: జిల్లాలో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అనుచరుల వీరంగం సృష్టించారు. నగర శివారులోని జన్మభూమి కాలనీలో కోట్ల రూపాయలు విలువ చేసే మూడు ఎకరాలను ఆక్రమించే యత్నం చేశారు. జేసీబీలతో కాలనీలో ఇళ్ల పునాదులను నేలమట్టం చేయడంతో పాటు ఫెన్సింగ్‌ను ధ్వంసం చేశారు. జన్మభూమి కాలనీ వాసులు వేసుకున్న ఫెన్సింగ్‌ను, ఇళ్లను రాత్రికి రాత్రే  జేసీబీలతో ఎమ్మెల్యే అనుచరులు నేలమట్టం చేశారు. ఎమ్మెల్యే అనుచరుల తీరుపై  జన్మభూమి కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ నాయకులు కబ్జా చేస్తున్నారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు పిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపించారు. పోలీసులు కబ్జాదారులకు వత్తాసు పలుకుతున్నారని బాధితులు ఆక్రోశం వెల్లగక్కుతున్నారు. స్పందన కార్యక్రమంలో కలెక్టర్, ఎస్పీలకు  ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని బాధితులు ఆరోపించారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.