ఫిడే ఉపాధ్యక్షుడిగా ఆనంద్
ABN , First Publish Date - 2022-08-08T10:19:51+05:30 IST
భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ ఫిడే డిప్యూటీ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యాడు.
చెన్నై: భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ ఫిడే డిప్యూటీ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యాడు. ప్రస్తుత ఫిడే ప్రెసిడెంట్ ఆర్కాడి డోర్కోవిచ్ రెండోసారి అధ్యక్ష పీఠాన్ని అఽధిరోహించాడు. చెన్నైలో జరిగిన ఫిడే కాంగ్రెస్‌లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేశారు. ఆర్కాడికి మద్దతుగా 157 ఓట్లు రాగా అతడి ప్రత్యర్థి ఆండ్రీ బారిష్పోలెట్స్కు 16 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆర్కాడి, అతడి ప్యానెల్ నుంచి పోటీ చేసిన ఆనంద్‌తో పాటు అందరూ విజయం సాధించారు.