హార్వార్డ్ యూనివర్సిటీ కూడా ఆ విషయాన్ని ఇంతకంటే బాగా చెప్పలేదు: Anand Mahindra

ABN , First Publish Date - 2022-04-23T20:08:53+05:30 IST

ఇండస్ట్రియలిస్ట్ ఆనంద్ మహీంద్ర.. ఈ పేరు తెలియని వారు బహుశా ఉండరేమో. సోషల్ మీడియాలో చురు

హార్వార్డ్ యూనివర్సిటీ కూడా ఆ విషయాన్ని ఇంతకంటే బాగా చెప్పలేదు: Anand Mahindra

ఇంటర్నెట్ డెస్క్: ఇండస్ట్రియలిస్ట్ ఆనంద్ మహీంద్ర.. ఈ పేరు తెలియని వారు బహుశా ఉండరేమో. సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ.. ఆసక్తికర విషయాలను ఎప్పటికప్పుడు నెటిజన్లతో పంచుకోవడమే కాకుండా వాటిపై తన అభిప్రాయాలను తెలియజేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తారు. ఎప్పటిలాగే తాజాగా ఓ వీడియోను షేర్ చేసిన ఆయన.. అందులో దాగున్న విలువైన విషయాన్ని వెల్లడించారు. 



ఒక వీడియోలో ఇద్దరు చిన్నారులు ఓ సైకిల్‌కు ఉన్న రెండు పడెల్స్‌పై చేరోపక్క నించొని, దాన్ని తొక్కుతూ చక్కగా బ్యాలెన్స్ చూస్తూ ముందుకు సాగిపోతారు. ఈ వీడియో మహీంద్రుడి కంటపడటంతో ఆయన ఫిదా అయ్యారు. అంతేకాకుండా సహకారం, టీం వర్క్‌‌కు ఉన్న ప్రాముఖ్యతను వెల్లడించారు. ‘సహకారం, టీమ్‌ వర్క్‌లతో ఉపయోగం ఏంటో వివరించేందుకు ఇంతకంటే మంచి వీడియోను హార్వర్డ్‌ యూనివర్సిటీ కూడా చూపలేదు’ అని పేర్కొంటూ ట్విట్టర్‌లో వీడియోను పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 




Updated Date - 2022-04-23T20:08:53+05:30 IST