కరోనా ప్రపంచకప్ పెడదామన్న నెటిజన్.. ఓకే అన్న ఆనంద్ మహీంద్రా

ABN , First Publish Date - 2022-01-07T02:25:26+05:30 IST

ఒమైక్రాన్ వేరియంట్ ఏమంటూ పుట్టుకొచ్చిందో కానీ అది దేశదేశాలు పాకిపోతోంది. దీని దెబ్బకు చల్లారిపోయిందనుకున్న..

కరోనా ప్రపంచకప్ పెడదామన్న నెటిజన్.. ఓకే అన్న ఆనంద్ మహీంద్రా

న్యూఢిల్లీ: ఒమైక్రాన్ వేరియంట్ ఏమంటూ పుట్టుకొచ్చిందో కానీ అది దేశదేశాలు పాకిపోతోంది. దీని దెబ్బకు చల్లారిపోయిందనుకున్న కరోనా వైరస్ మళ్లీ పడగ విప్పింది. అమెరికా, యూరప్ దేశాలు అల్లాడిపోతున్నాయి. ఇక, మన దేశంలోనూ ఇది శరవేగంగా వ్యాప్తి చెందుతూ ప్రజలను భయపెడుతోంది. దీని కారణంగా మూడో వేవ్ తప్పదని ఇప్పటికే నిపుణులు హెచ్చరిస్తున్నారు.  పలు రాష్ట్రాలు ఇప్పటికే కఠిన ఆంక్షల్లోకి వెళ్లిపోయాయి. మరికొన్ని ఆంక్షలకు రెడీ అవుతున్నాయి. 


ఈ నేపథ్యంలో ఓ ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన కామెంట్‌కు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా మద్దతు తెలిపారు. ఇప్పుడిది సోషల్ మీడియాను చుట్టేస్తోంది. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఆనంద్ మహీంద్రా దృష్టికి నార్బెర్ట్ జోషి అనే యూజర్ చేసిన ట్వీట్ వచ్చింది.


అందులో.. ‘నైజీరియాలో ఓ కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది. ఇది యూకే వేరియంట్‌కు భిన్నమైనది’ అని ఉంది. ఆ ట్వీట్‌కు సుశీల్ యాదవ్ అనే మరో యూజర్ స్పందిస్తూ.. ‘‘ఒక్కో దేశంలో ఒక్కో వేరియంట్ వెలుగులోకి వస్తోంది. ఈ సంవత్సరాంతంలో కరోనా వైరస్ ప్రపంచకప్ పెడదాం’’ అని పేర్కొన్నాడు.


దీనికి ఆనంద్ మహీంద్రా.. ‘ఐ సెకండ్ ది మోషన్’ అంటూ తన మద్దతు తెలిపారు. దానికి నవ్వుతున్న, చప్పట్లు కొడుతున్న ఎమోజీలను జతచేశారు. ఆయన ట్వీట్‌కు శివాజీ అనే యూజర్ రిప్లై ఇస్తూ.. ‘‘విజేతకు మహీంద్రా 700 లభిస్తుంది’’ అని పేర్కొన్నాడు.  



Updated Date - 2022-01-07T02:25:26+05:30 IST