Advertisement

భలే ఐడియా.. మా కారునూ ఇలాగే మార్చాలి.. ఆనంద్ మహీంద్రా వైరల్ ట్వీట్!

Feb 27 2021 @ 19:48PM

ఇంటర్నెట్ ‌డెస్క్: మీరు రెగ్యులర్‌గా సోషల్ మీడియాను  ఫాలో అవుతుంటారా..? కొత్తగా ఏం ట్రెండ్ అవుతోందనని అటువైపు ఓ కన్నేసి ఉంచుతారా..? అయితే.. మీకు అరుణ్ ప్రభు ఎవ్వరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చెన్నైకి చెంది ఈ ఆర్కిటెక్ట్ పేరు కొద్ది నెలల క్రితం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఓ ఆటోను సంచార గృహంగా మార్చేసిన ఆయన్ను చూసి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు. చిన్న స్థలాన్ని కూడా నివాస యోగ్యం ఎలా మార్చాలో చూపిస్తూ అరుణ్ ఓ ఆటోపై నివాస సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. చూటడానికి అచ్చు ఇల్లులాగా కనిపించే ఈ సెట్‌ మొత్తం అపట్లో సంచార గృహం పేరిట బాగా వైరల్ అయింది. అయితే.. అరుణ్ ప్రభు తాజాగా ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహింద్రా దృష్టిలో పడ్డారు. అరుణ ప్రభు ఐడియా  ఆయనకు కూడా నచ్చడంతో ఆనంద్ మహీంద్రా ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాకుండా ఆయన కాంటాక్ట్ వివరాలు ఎవరైనా తెలుపగలరా అని నెటిజన్లను కోరారు. 

 

‘చిన్ని చిన్ని స్థలాల్లోనూ నివాస సదపాయాలను ఎలా ఏర్పాటు చేసుకోవచ్చో సూచించేందుకు అరుణ్ దీన్ని డిజైన్ చేశారని తెలిసింది. అయితే.. అరుణ్ దృష్టి ఇంతకంటే పెద్ద ట్రెండ్‌పైనే పడిందని నేను అనుకుంటున్నాను. కరోనా సంక్షోభం అనంతరం.. స్వేఛ్చగా విహరించాలనే ప్రజల అభిష్టంపై దృష్టి పెట్టి ఉండొచ్చు. అయితే..ఆయన బొలెరోపై కూడా ఇటువంటి సదుపాయాన్ని ఏర్పాటు చేయగలరా..? ఆయన కాంటాక్ట్ వివరాలు ఎవరైనా చెప్పగలరా..అంటూ ఆయన తాజాగా ట్వీట్ చేశారు.

Follow Us on:
Advertisement

ప్రత్యేకంమరిన్ని...