ఆనందయ్య మందు పంపిణీపై హైకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2021-06-21T20:27:29+05:30 IST

ఆనందయ్య మందు పంపిణీపై సోమవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.

ఆనందయ్య మందు పంపిణీపై హైకోర్టులో విచారణ

అమరావతి: ఆనందయ్య మందు పంపిణీపై సోమవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. చుక్కల మందును ఐదు ల్యాబ్‌ల్లో పరీక్షలు జరిపించామని, అందులో ఒక ల్యాబ్‌లో కంటికి హానీ కలిగించే పదార్థం ఉందని నివేదిక వచ్చినట్లు ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ల్యాబ్‌లో నివేదికను కోర్టుకు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. చుక్కల మందును ఆయుష్ రీసెర్చ్ సెంటర్‌లో టెస్ట్ చేయించాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరారు. ఇరువైపు వాదనలు విన్న అనంతరం హైకోర్టు తదుపరి విచారణను జులై 1కి వాయిదా వేసింది.

Updated Date - 2021-06-21T20:27:29+05:30 IST