Advertisement

కొడికొండ చెక్‌పోస్ట్‌లో పోలీసుల చేతివాటం

Oct 26 2020 @ 13:05PM

అనంతపురం: జిల్లాలోని కొడికొండ చెక్‌పోస్ట్‌లో పోలీసులు చేతివాటం ప్రదర్శించారు. ప్రొద్దుటూరుకు చెందిన వారిని బెదిరించిన  ఇద్దరు కానిస్టేబుళ్లు వారి వద్ద నుంచి  రెండు బంగారు బిస్కెట్లను తీసుకున్నారు. దీంతో ఈ విషయంపై చిలమత్తూరు పోలీసులకు  ప్రొద్దుటూరు గోల్డ్ షాపు యజమాని ఫిర్యాదు చేశారు. ఇద్దరు కానిస్టేబుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 24న బెంగళూరు నుంచి ప్రొద్దుటూరు వెళ్తుండగా కొడికొండ చెక్‌పోస్ట్‌లో వాహనాలు తనిఖీ చేయగా... ఓ వాహనంలో బంగారం తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు ఇందుకు సంబంధించిన బిల్లులు లేకపోవడంతో బంగారు బిస్కెట్లు డిమాండ్ చేశారు. రెండు బంగారు బిస్కెట్లు తీసుకుని వాహనాన్ని వదిలి పెట్టినట్లు తెలుస్తోంది. 

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.