అనంతపురం: మద్యం మత్తులో వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని కొత్తచెరువు మస్తానప్ప వీధికి చెందిన మహేంద్ర(22) యువకుడు బ్లేడుతో చెయ్యి కోసుకుని బలవన్మరణానికి యత్నించాడు. మద్యానికి బానిసై తాగడానికి డబ్బులు ఇవ్వలేదని నెపంతో ఇంటిలో తల్లిదండ్రులతో గొడవపడి యువకుడు చేయి కోసున్నాడు. తీవ్రంగా రక్తస్రావం కావడంతో వెంటనే అతడిని 108 వాహనంలో హుటాహుటిన ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.