ABN Effect: ఉరవకొండలో ఫ్లెక్సీల తొలగింపు

Published: Fri, 22 Apr 2022 09:56:26 ISTfb-iconwhatsapp-icontwitter-icon

అనంతపురం: ఉరవకొండలో వివాదాస్పదంగా మారిన ఫ్లెక్సీలను పోలీసులు తొలగించారు. పోలీసు స్టేషన్ పక్కన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో పాటు పలు కూడళ్లలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను పోలీసులు తొలగించారు. పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రణయ్ రెడ్డి జన్మదిన వేడుకలకు పోలీసు ఉన్నతాధికారులు హాజరవుతున్నారంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో కథనం ప్రసారం కావడంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఫ్లెక్సీలు తొలగించారు. కాగా... ప్రణయ్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలకు ఎస్పీ హాజరవుతారా లేదా అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.