Anantapurలో కీచక టీచర్‌కు పోలీసుల దన్ను
ABN , First Publish Date - 2022-02-20T14:36:54+05:30 IST
జిల్లాలో కీచక ఉపాధ్యాయుడు సాలేవేముల బాబుకు పోలీసులు దన్నుగా నిలిచారు.
అనంతపురం: జిల్లాలో కీచక ఉపాధ్యాయుడు సాలేవేముల బాబుకు పోలీసులు దన్నుగా నిలిచారు. మూడు రోజుల క్రితం కీచక టీచర్‌ను అదుపులోకి తీసుకొన్న గుత్తి పోలీసులు... ఓ ఉపాధ్యాయ సంఘం నేత పూచికత్తుతో వదిలిపెట్టారు. పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. ఉపాధ్యాయున్ని అరెస్ట్ చేయడంలో పోలీసుల వైఫల్యం స్పష్టమైంది. కీచక ఉపాధ్యాయుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని వదిలిపెట్టడంపై విద్యార్థినుల తల్లిదండ్రుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.