అనంతపురం: జిల్లాలోని బుక్కపట్నం ఫారెస్ట్ అగ్నికి ఆహుతి అవుతోంది. వందల ఎకరాల్లో అటవీ సంపద దగ్ధమవుతోంది. పెద్ద ఎత్తున వ్యాపించిన మంటలకు వందల ఏళ్ల నాటి వృక్షాలు కాలి బూడిదవుతోంది. అయితే విషయం తెలిసినప్పటికీ అటవీశాఖ అధికారులు పట్టించుకోలేదు. అయితే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. వరుసగా ఇదే తరహా ఘటనలు జరుగుతుండటంతో అటవీ శాఖ అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇవి కూడా చదవండి