అనంతపురం: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ‘‘ఆర్ఆర్ఆర్’’ సినిమా చూస్తూ గుండెపోటుతో అభిమాని ఓబులేష్ మృతి చెందాడు. ఎస్వి మాక్స్ థియేటర్లో ఆర్ఆర్ఆర్ సినిమా చూస్తుండగా ఓబులేసు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. చికిత్స నిమిత్తం ఓబులేసును స్నేహితులు హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి