అనంతలో పోలీసుల అత్యుత్సాహం

ABN , First Publish Date - 2021-12-03T17:17:35+05:30 IST

జిల్లాలోని ఆత్మకూరు మండలం బి.యాలేరులో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు.

అనంతలో పోలీసుల అత్యుత్సాహం

అనంతపురం: జిల్లాలోని ఆత్మకూరు మండలం బి.యాలేరులో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కురుబల ఆరాధ్యదైవం కనక దాస జయంతి వేడుకలను ఆత్మకూరు సిఐ శివ శంకర్ నాయక్ అడ్డుకున్నారు. కనకదాసు ఫోటోతో ఊరేగింపు నిర్వహిస్తున్న కురుబ సామాజిక వర్గానికి చెందిన వారికి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. దీంతో పోలీసుల తీరును నిరసిస్తూ కురుబ సామాజికవర్గానికి చెందిన మహిళలు, యువకులు ఆందోళనకు దిగారు. దీంతో గ్రామానికి చెందిన  శివ, నాగార్జున, రామాంజి, గంగాధర్ అనే నలుగురు యువకులతో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

Updated Date - 2021-12-03T17:17:35+05:30 IST