అనంతపురం: జిల్లాలోని పామిడి పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మూడు ఎద్దుల బండ్లను లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చితంబరి(50)అనే కూలీ మృతి చెందాడు. రెండు ఎద్దులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి