
అనంతపురం: జిల్లాలోని నల్లమాడ మండలం పులగం పల్లి సమీపంలో మినీవ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా... మరో ఆరు మందికి తీవ్ర గాయాలయ్యాయి. కదిరి ప్రాంతానికి చెందిన 25 మంది తిరుమల దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మరో ఐదు నిమిషాల్లో స్వగ్రామానికి చేరుకునేలోపే ప్రమాదం జరగడంపై పులగంపల్లిలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నారు. ఈ ప్పరమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి