AP: కియా ఉద్యోగులను ఢీకొట్టిన కారు

Sep 27 2021 @ 08:36AM

అనంతపురం: జిల్లాలోని రొద్దం మండలం పాతర్ల పల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోలో వెళ్తున్న కియా ఉద్యోగులను ఓ కారు అతి వేగంతో వచ్చి ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు ఉద్యోగులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.